Bheemla Nayak 5th Show In Telangana: తెలంగాణలో 'భీమ్లా నాయక్'కు బంపర్ ఆఫర్, ఐదో షోకు అనుమతి
తెలంగాణలో 'భీమ్లా నాయక్'కు బంపర్ ఆఫర్ లభించింది. ఐదో షో ఆటకు అనుమతి ఇస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25న) సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమాకు బంపర్ ఆఫర్ లభించింది. రెండు వారాల పాటు థియేటర్లలో ఐదు ఆటలు వేసుకోవడానికి అనుమతి (Bheemla Nayak 5th show permission granted in Telangana from 25 February to 11 March) ఇస్తూ... తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఉదయం ఆరు గంటల నుంచి షోలు వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు.
5th show permission granted for #PawanKalyan's #BheemlaNayak
— Yakhub mohd (@mohd_yakhub) February 23, 2022
in #Telangana for 2 weeks. #BheemlaNayakOnFeb25th pic.twitter.com/7JyKpBlqW3
తెలంగాణ గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు బెనిఫిట్ షోలు (Bheemla Nayak Benefit shows In Telangana) వేయడానికి కూడా రెడీ అవుతున్నారట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు వేయడానికి అంతా రెడీ అయ్యింది. మూవీ కంటెంట్ కూడా అమెరికా డెలివరీ అయ్యింది.
Also Read: తేడా ఉండాలిగా! ట్రైలర్‌లో అన్నీ ఆశిస్తే ఎలా? - మిక్డ్స్ టాక్ గురించే తమన్ ఆ ట్వీట్ చేశారా?
పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు.
Also Read: గొడవ సెటిల్ అయిపోయినట్లేనా? బుక్ మై షోలో 'భీమ్లా నాయక్'
View this post on Instagram