Bhagavanth Kesari OTT: ఓటీటీలోకి ‘భగవంత్ కేసరి‘ - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Bhagavanth Kesari OTT: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భగవంత్ కేసరి’ ఓటీటీలో రాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది.
Bhagavanth Kesari OTT Release Date: ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల అయ్యింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో ఎదిగే వయసు అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను చూపించే ప్రయత్నం చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించారు. ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే మెసేజ్ కూడా ఉండడంతో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలయ్య యాక్టింగ్, డైలాగ్స్, అనిల్ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్మురేపింది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూలు చేసింది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి హీరోల తర్వాత వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా బాలయ్య నిలిచారు. అంతేకాదు, సీనియర్ హీరోలలో రూ.100 కోట్ల హ్యాట్రిక్ అందుకున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.
నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
‘భగవంత్ కేసరి’ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలను అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలిపింది. నిజానికి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో పలు ఓటీటీ సంస్థ పోటీ పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమా రైట్స్ ను పెద్ద మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ భాగస్వామికి సంబంధించిన వివరాలను మూవీ టైటిల్ కార్డ్స్ లోనే చిత్రబృందం వెల్లడించింది. ఇక తాజాగా రేపటి నుంచి ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా చూడని అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్, రవిశంకర్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవి, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఇప్పటికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, రెండో షెడ్యూల్ ను ఊటీలో చిత్రీకరించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Read Also: అంగరంగ వైభవంగా ‘బిగ్‌బాస్ మానస్ వెడ్డింగ్ - ఫోటోలు, వీడియోలు వైరల్