Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?
‘జయ జానకి నాయక’ సినిమా తెలుగులో 2017 లో విడుదలైంది. ఈ సినిమాను 2019 లో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అలాగే సినిమాల తీసే విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అందులోనూ కరోనా లాంటి పరిస్థితులు వచ్చి వెళ్లాక సినిమాల పరంగా భాషాభేదాలు తగ్గిపోయాయి. ఇప్పడు అన్ని భాషల సినిమాలను అందరూ చూస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవ్వకపోయినా హిట్ టాక్ వస్తే ఇతర భాషల్లో కూడా డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తుంటారు మేకర్స్. అలా టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోల సినిమాలు హిందీ లో కూడా విడుదల చేసేవారు. అయితే వాటిల్లో కొన్ని సినిమాలు తెలుగులో కంటే హిందీలోనే విపరీతంగా ఆదరణ పొందాయి. అలా హిందీలో డబ్ చేసిన ఓ టాలీవుడ్ సినిమా హిందీలో రికార్డు స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ మూవీ.
హిందీలో విపరీతమైన ఫాలోయింగ్..
‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ మూవీతో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో ఆయనకు ఓ మోస్తరు మార్కెట్ ఉంది. అయితే ఆయనకు హిందీలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన హిందీ డబ్ సినిమాలకు మిలియన్ల వ్యూస్ వస్తాయి. అందుకే అతని సినిమాలు అన్నీ హిందీలో కూడా డబ్ చేస్తారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమాను కూడా హిందీలో డబ్ చేశారు. ఈ మూవీ హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీకు హిందీలో ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని ఘనత శ్రీనివాస్ కు దక్కింది. ఇక ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించింది.
అందుకే హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్..
‘జయ జానకి నాయక’ సినిమా తెలుగులో 2017 లో విడుదల అయింది. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 8, 2019 న హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో ‘జయ జానకి నాయక ఖూన్కర్’ అనే పేరుతో అప్లోడ్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఏ సినిమాకు అయినా ఇలా 700 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా అరుదు. ఈ వ్యూస్ చూస్తుంటే శ్రీనివాస్ కు అక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి హిందీ బాక్స్ ఆఫీస్ మీద గురిపెట్టారు. తనకు ‘అల్లుడు శీను’ తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వివి వినాయక్ తో కలసి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హిందీలో కూడా ఈ మూవీను ‘ఛత్రపతి’ పేరుతోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ మే 12 న హిందీలో రిలీజ్ కానుంది.
Also Read: ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?