News
News
X

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

బిగ్ బాస్ సీజన్ 6 అక్టోబర్ 1 శనివారానికి సంబంధించి మరో ప్రోమో విడుదలైంది.

FOLLOW US: 

వీకెండ్ వచ్చేసింది హౌస్ మేట్స్ ని పలకరించడానికి హోస్ట్ నాగార్జున కూడా వచ్చేశారు. నవ్వులు, సరదా ఆటలు, క్లాస్ పీకడాలతో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. వారం మొత్తం మీద హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అని నాగ్ చూసి బాగా ఆడితే మెచ్చుకోవడం.. ప్రవర్తన సరిగా లేకపోతే మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. తాజాగా శనివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించి మరో ప్రోమోని వదిలారు. అందులో హౌస్ మేట్స్ తో సరదాగా పాని పూరీ ఆట ఆడించారు.

తాజా ప్రోమో ప్రకారం నాగ్ ఇచ్చిన పాని పూరీ ఆట ఇంట్లో మంట పెట్టేసింది. రేవంత్ భార్య శ్రీమంతం గురించి నాగ్ మాట్లాడుతూ ఎలా ఉందని అడిగారు. నువ్వు ఎప్పుడు చేయించుకుంటున్నావ్ శ్రీమంతం అని అడగడంతో ఇంట్లో నవ్వులు పూసాయి. ఇంట్లో అందరి కంటే చంటి పెద్దవాడని అంటున్నారు. కానీ నిజం ఏమిటంటే శ్రీహాన్ పెద్దవాడని నాగ్ చెప్పేశారు. ఇక ఆరోహిని బుజ్జమ్మ అంటే ఎవరు అని అడిగినప్పుడు సూర్యని చూపించడంతో అది వాళ్లిద్దరికి కనెక్ట్ అయ్యిందని అనిపిస్తుంది. కానీ తన లవ్ ఎవరో బయటపెట్టేసింది ఆరోహి. ఇక 'బీబీ ఛాట్ బండార్' అని పాని పూరీ ఆట మొదలుపెట్టేస్తారు నాగ్.

హౌస్ మేట్స్ కి సంబంధించి కొన్ని బిరుదులు ఇస్తూ పాని పూరిని తమకి నచ్చిన విధంగా చేసి వేరే వాళ్ళతో తినిపించాలి. ఇక గీతూ సోమరిపోతు అని వాసంతి తనకి పాని పూరీ తినిపిస్తుంది. శ్రీహాన్ తనని ఏడిపిస్తుంది రేవంత్ అంటూ తనకి పానిపూరీ తినిపించాడు. బయట ఎవరు ఏడిపించేది అని నాగ్ అంటే శ్రీహాన్ ఇద్దరి పేర్లు చెప్తాడు. బాగా కవర్ చేశావ్ అని కింగ్ అందరి ముందు గాలి తీసేస్తారు. ఇక చంటి పానీపూరిలో బాగా ఉప్పు వేసి గీతుకి తెచ్చి ఇస్తాడు. కోపంతో గీతూ అందులో వాటర్ కలిపేసుకుని అలాగే తినేస్తుంది. ఇక గీతూ తన వంతు రాగానే చంటి మీద పగ తీర్చుకుంటుంది. మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేట్ పర్సన్ అని గీతూ చంటికి పానిపూరీ ఇస్తుంది.

అంతక ముందు రిలీజ్ చేసిన ప్రోమోలో గీతూ విషయంలో బాలాదిత్య అడ్డంగా బుక్కైపోతాడు. హౌస్ లో గీతూని ఏడిపించారని బాలాదిత్యకి క్లాస్ పీకుతాడు. ఇక సూర్య, ఆరోహి విషయంలోనూ సీరియస్ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల సూర్య కోపంగా వెళ్ళి తినే అన్నాన్ని చెత్త బుట్టలో వేస్తాడు. అది చూసి గతవారం కెప్టెన్ గా ఉన్న ఆది రెడ్డిని ఏం పీకావ్ అని అడిగారు. జైల్లో కూర్చున్న అర్జున్ దగ్గర శ్రీ సత్య ముచ్చట పెట్టడంపై మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చూపించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో తొలిసారిగా అమ్మాయి కీర్తి హౌస్ కి కెప్టెన్ అయ్యింది.  

News Reels

Also Read: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Also read: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

Published at : 01 Oct 2022 05:59 PM (IST) Tags: Revanth Bigg Boss Season 6 Telugu Bigg Boss 6 Chalaki Chanti Nagarjuna Galata Geetu Bigg Boss Season 6 Telugu Written Update

సంబంధిత కథనాలు

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి