Prabhas: బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ!
కృతితో ప్రభాస్ కి స్పెషల్ బాండింగ్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే 'కాఫీ విత్ కరణ్' షోలో కృతి.. ప్రభాస్ కి ఫోన్ చేసిందో అప్పటినుంచి ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) డేటింగ్ లైఫ్ గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన కో-స్టార్ కృతిసనన్(Kriti Sanon) తో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. కృతితో ప్రభాస్ కి స్పెషల్ బాండింగ్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే 'కాఫీ విత్ కరణ్' షోలో కృతి.. ప్రభాస్ కి ఫోన్ చేసిందో అప్పటినుంచి ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.
Baseless gossip on Prabhas in circulation: కానీ ఇదంతా కావాలనే చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. దానికి ముందు హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ ప్రచారం చేస్తుంటారు. ఆ విధంగా సినిమాకి మరింత బజ్ తీసుకొస్తారు. పైగా ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో.. ఆయనకు కృతిసనన్ ను లింక్ చేస్తూ వార్తలు వండేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని అంటున్నారు ప్రభాస్ సన్నిహితులు.
ప్రస్తుతం ప్రభాస్, కృతిసనన్ కలిసి నటించిన 'ఆదిపురుష్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఓం రౌత్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ని విడుదల చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ప్రభాస్ పుట్టినరోజు నాడు లేదంటే దసరాకి టీజర్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఎప్పటినుంచో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. టీజర్ వస్తుందనే సంతోషంలో 'ఆదిపురుష్' ట్యాగ్ ను ట్రెండ్ చేసే పనిలో పడ్డారు.
అయితే ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అలానే టీజర్ కి సంబంధించిన ప్రభాస్ తో ఓ స్పెషల్ షూట్ చేయాలని ప్లాన్ చేశారు దర్శకుడు ఓం రౌత్. కానీ ఇప్పుడు ప్రభాస్ ఉన్న పరిస్థితుల్లో ఒక నెల వరకు షూటింగ్స్ లో పాల్గొనేలా లేరు. కారణాలు ఏవైనా గానీ.. 'ఆదిపురుష్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పేలా లేదు.
హాలీవుడ్ లో 'ఆదిపురుష్':
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Also Read : సమంతకు జోడీ - దుష్యంత మహారాజు - దేవ్ మోహన్ ఫస్ట్ లుక్
Also Read : భర్తకు నయనతార సర్‌ప్రైజ్... అక్కడికి తీసుకువెళ్ళి మరీ