News
News
X

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

భార్యను, బిడ్డలను ప్రేమించనోడు అసలు మనిషేనా..? అంటూ దర్శకుడు పూరిపై మండిపడ్డారు బండ్ల గణేష్. 

FOLLOW US: 
 
దర్శకుడు పూరి జగన్నాధ్ పై నిర్మాత, దర్శకుడు బండ్ల గణేష్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. భార్యను, బిడ్డలను ప్రేమించనోడు అసలు మనిషేనా..? అంటూ మండిపడ్డారు. రీసెంట్ గా బండ్ల గణేష్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో బండ్ల గణేష్ చాలా విషయాల గురించి ప్రస్తావించారు. ముందుగా యాంకర్.. 'వ్యాపారాలు, వ్యాపకాలు చాలానే ఉన్నాయి కదా వాటిని పక్కన పెట్టి రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నారని..?' ప్రశ్నించగా.. 'నేను ఎక్కడ కెలికాను.. నన్ను ఇరికించాలని చూడకు. శకుని క్యారెక్టర్ నా దగ్గర ప్లే చేయకు' అంటూ ఫైర్ అయ్యారు. 

ఆ తరువాత 'నటుడు పోసాని చావు మాములుగా ఉండదని చెప్పడానికి మీరెవరు..? ఆయనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా..?' అని యాంకర్ అడగ్గా.. 'నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు. కేటీఆర్ గారు అంటే ఆన్సర్ ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. లింక్‌లు పెడితే చెప్పను. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టాలి అంతేకానీ మా అమ్మ నాయన ఏం చేశారు' అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. 

'నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని పూరి గారు ఎందుకు స్పందించారు..?' అని యాంకర్ ప్రశ్నించగా.. 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషా అన్నా' అని తిరిగి ప్రశ్నించారు బండ్ల గణేష్. 'ప్రేమించడం ప్రేమించకపోవడం ఆయన ఇష్టం' అని యాంకర్ అనగా.. 'పూరి అనేవాడికి మంచి, చెడు చెప్పే రైట్ నాకుంది. నా ఫ్రెండ్' అంటూ సీరియస్ గా మాట్లాడారు బండ్ల గణేష్. 

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే..?:

News Reels

పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి సినిమా 'చోర్ బజార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు బండ్ల గణేష్. ఆ ఈవెంట్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ చర్చనీయాంశమైంది. కన్న కొడుకు ఈవెంట్ కి పూరి రాలేదని.. అతడిని నాలుగు మాటలు అన్నారు బండ్ల గణేష్. అంతే కాదు.. పూరి భార్యను సీతమ్మతో పోల్చారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు చాలా అనుమానాలకు దారి తీసింది. 

ఈ స్పీచ్ పై ఎవరూ డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ పూరి తన మ్యూజింగ్స్ ద్వారా బండ్లకు వార్నింగ్ ఇచ్చారు. అసలు పూరి జగన్నాథ్ ఏం అన్నారు? అనే విషయానికి వస్తే... ''గుర్తు పెట్టుకోండి! మన నాలుక కదులుతున్నంత సేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే, జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా (ఇతరులు చెప్పింది వింటూ) ఉంటే మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు... క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు... ఆఫీస్ పీపుల్ కావచ్చు... ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దు. మన వాగుడు మన కెరీర్ ను, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు సుమతి శతకం గుర్తుండే ఉంటుంది. 'నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి' అని! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. నీ జీవితం, మరణం నీ నాలుక (మాటల) మీద ఆధారపడి ఉంటాయి''. ఆయన మాటల్లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు. కానీ, బండ్లను ఉద్దేశించి ఇలా మాట్లాడారని చాలా మంది అభిప్రాయపడ్డారు. 

Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

Published at : 30 Sep 2022 05:41 PM (IST) Tags: Puri Jagannadh posani Bandla Ganesh

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Telugu Movies Remake 2022 : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

Telugu Movies Remake 2022 : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

టాప్ స్టోరీస్

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

KTR Vs Bandi Sanjay :  కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !