Unstoppable 2 Records : ఓటీటీలో బాలకృష్ణ సెన్సేషన్ - 24 గంటల్లో వన్ మిలియన్ ప్లస్ బాసూ!
'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఒక్క రోజులో మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రికార్డుల పరంపర వెండితెరపై మాత్రమే కాదు... డిజిటల్ తెరపై కూడా కంటిన్యూ అవుతోంది. 'ఆహా' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'తో ఆయన డిజిటల్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. హోస్టుగా మారారు. ఆ టాక్ షో ఐఎంబీడీలో హయ్యస్ట్ రేటెడ్ టాక్ షోగా నిలిచింది.
ఇప్పుడు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సెకండ్ సీజన్ (Unstoppable With NBK Season 2) స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో రికార్డుల వేట మొదలు పెట్టిన బాలకృష్ణ... ఎపిసోడ్ విడుదల తర్వాత ఆ వేట కంటిన్యూ చేస్తున్నారు. రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన తనయుడు లోకేష్ (Nara Lokesh) అతిథులుగా వచ్చారు. వీళ్ళు బాలకృష్ణకు బంధువులు. బాలకృష్ణ చంద్రబాబు బావ, వియ్యంకుడు అయితే... లోకేష్ మేనల్లుడు, పిల్లను ఇచ్చిన అల్లుడు! పైగా, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పే కీలక నేతలు కావడంతో ఈ ఎపిసోడ్ మీద అందరి దృష్టి పడింది.
ఇరవై నాలుగు గంటల్లో...
పది లక్షలకు పైగా వ్యూస్!
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్‌లో బావ, అల్లుళ్ళతో బాలకృష్ణ ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ అంశాలను కూడా డిస్కస్ చేశారు. నందమూరి కుటుంబానికి, తెలుగు దేశం పార్టీకి మూల పురుషుడు అయినటువంటి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NT Rama Rao) ప్రస్తావన కూడా షోలో వచ్చింది. ఎపిసోడ్‌లో సంచనాలు ఉన్నాయని ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చారు. దాంతో చాలా మంది ఆసక్తి కనబరిచారు.
View this post on Instagram
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2' ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ వెల్లడించింది. సెన్సేషనల్ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని, నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ఓటీటీ రికార్డులు తిరగరాస్తున్నారని పేర్కొంది. మరోవైపు యూట్యూబ్‌లో కూడా ప్రోమో రికార్డుల మోత మోగిస్తోంది. మూడు రోజులుగా టాప్ ట్రెండ్స్ లో ఉంది.
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2'లో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ మాట్లాడిన మాటలు తెలుగు దేశం పార్టీ వర్గాలకు సంతోషం కలిగించగా... రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. బావ బావమరుదులు అబద్ధాలు చెప్పారని విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. విదేశాల్లో స్నేహితులతో లోకేష్ దిగిన ఫోటో మీద పదే పదే వైరి వర్గాలు చేసే విమర్శలతో పాటు తన ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌కు ఎదురు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల గురించి ఈ టాక్ షోలో వివరణ ఇచ్చారు. ప్రత్యర్థులపై విమర్శలు చేశారు.
Also Read : మళ్ళీ ట్రోల్స్ మొదలు - విష్ణు మంచుపై 'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?
విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ కూడా!
'అన్‌స్టాపబుల్ 2'లో ఒక ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది విడుదల విడుదల అయ్యేది త్వరలో ప్రకటించనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన టీజర్, ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంది.