Balakrishna's NBK108 Update : జైల్లో భారీ ఫైట్ ఫినిష్ చేసిన బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 2022లో పూజతో సినిమా స్టార్ట్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
జైల్లో భారీ ఫైట్!
బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108 వర్కింగ్ టైటిల్ పెట్టారు. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ జైలు సెట్ వేశారు. ఆ సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. దానికి వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎన్‌బీకే 108 సెట్స్‌లో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. న్యూ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.
ఎన్‌బికె 108లో శరత్ కుమార్!
వినోదంతో పాటు వాణిజ్య విలువలు జోడించి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కూడా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగులో ఆయన కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ, శరత్ కుమార్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరక్కించినట్టు నిర్మాతలు తెలిపారు.
Also Read : పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!? - నరేష్, పవిత్ర పెళ్లిపై రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా?
View this post on Instagram
శ్రీలీల క్యారెక్టర్ ఏంటి?
తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి', లేటెస్ట్ మాస్ మహారాజా రవితేజ హిట్ 'ధమాకా' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. అయితే, ఆమె ఎవరి కుమార్తెగా నటిస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్!
ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... లేటెస్ట్ హ్యాట్రిక్ ఇది.
'వీర సింహ రెడ్డి' షూటింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ!
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'వీర సింహా రెడ్డి' షూటింగును బాలకృష్ణ పూర్తి చేశారు. ఆల్రెడీ 'వీర సింహా రెడ్డి' నుంచి విడుదలైన 'జై బాలయ్య...', 'సుగుణ సుందరి...' పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా 'సుగుణ సుందరి'లో బాలకృష్ణ, శృతి హాసన్... 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' పాటలో హానీ రోజ్, చంద్రికా రవితో బాలకృష్ణ వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఆ సినిమా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read : 'కోరమీను' రివ్యూ : ఎవరి వలలో ఎవరు పడ్డారు? - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?