News
News
X

Balakrishna: బాలయ్య సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కి క్రేజీ డీల్!

అఖండ' లాంటి హిట్టు సినిమా తరువాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో మార్కెట్ లో కూడా సినిమాకి బాగా డిమాండ్ పెరిగింది.

FOLLOW US: 

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. 'అఖండ' లాంటి హిట్టు సినిమా తరువాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో మార్కెట్ లో కూడా సినిమాకి బాగా డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లే డీల్స్ కూడావస్తున్నాయట . ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను రూ.58 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతుందని భావిస్తున్నారు. 

సిస్టర్ సెంటిమెంట్: 
ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇద్దరి మధ్య బలమైన సన్నివేశాలు రాశాడట దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ లో చూపించబోతున్నట్లు టాక్. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా అదే స్థాయిలో క్యారీ చేయబోతున్నారని సమాచారం. 

టర్కీలో షూటింగ్:
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. హీరో హీరోయిన్ల మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాలు తీశారు. అక్కడే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.

శ్రుతి హాసన్ కాకుండా సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా మరో సినిమా ఓకే చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

Published at : 16 Sep 2022 05:25 PM (IST) Tags: Balakrishna Shruti Haasan Gopichand Malineni NBK107

సంబంధిత కథనాలు

Gruhalakshmi October 6th: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi October 6th: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Devatha October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

Devatha  October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?