By: ABP Desam | Updated at : 26 Jan 2023 05:19 PM (IST)
కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). ఇందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేశారు.
ఎన్నో రాత్రులు వస్తాయి గానీ...
బాలకృష్ణ, దివ్య భారతి జంటగా నటించిన 'ధర్మ క్షేత్రం' గుర్తు ఉందా? ఆ సినిమాలో స్వర్గీయ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి రాసిన 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ...' పాట గుర్తు ఉందా? ఆ పాటను 'అమిగోస్' కోసం రీమిక్స్ చేశారు. ఈ నెల 29న ఆ పాట విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
''బాబాయ్ పాటల్లో నాకు ఇష్టమైన వాటిలో 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాట ఒకటి. దీనిని రీ క్రియేట్ చేయడం ఎంజాయ్ చేశా. మేం ఎంజాయ్ చేసినంత మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను'' అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Loved recreating one of my favourite songs of Babai ❤️
Hope you will love it as much as we did.#Amigos second single #EnnoRatrulosthayi on Jan 29th at 5.09 PM.
In cinemas on Feb 10th.@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi @MythriOfficial pic.twitter.com/OEwjElOSTx — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 26, 2023
బాలకృష్ణ పాటను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 'పటాస్' కోసం 'అరె ఓ సాంబ...' సాంగ్ రీమిక్స్ చేశారు. మరోసారి బాబాయ్ పాటతో అభిమానులకు కనువిందు ఇవ్వడానికి రెడీ అయ్యారు.
బడ్జెట్ అంతా నాన్ థియేట్రికల్ రైట్స్‌తో!
ఆల్రెడీ 'అమిగోస్' నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. 'బింబిసార' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్ 'అమిగోస్'ను తీసుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ నుంచి వచ్చేది అంతా లాభమే.
Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?
సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ... భారీ విజయాలు అందుకుంది. అంతే కాదు... ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా లాభాలు అందుకున్నాయి. అందువల్ల, సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేటు పలికే అవకాశం ఉంది.
Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?
మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్... 'అమిగోస్'లో రూపురేఖల పరంగా ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. వాళ్ళ మధ్య స్నేహాన్ని ఆవిష్కరించే 'యెక యెక...' పాటను తాజాగా విడుదల చేశారు. అందులో ముగ్గురి క్యారెక్టరైజేషన్లు కూడా కొంచెం చూపించారు. బీచ్ ఏరియాలో మాంచి స్టైలిష్, కలర్ ఫుల్ అమ్మాయిల మధ్య పాటను చిత్రీకరించారు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ మాత్రమే కాదు... నటుడు బ్రహ్మాజీ కూడా పాటలో ఉన్నారు. జిబ్రాన్ సంగీతంలో 'యెక యెక...' పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. అనురాగ్ కులకర్ణి పాటను ఆలపించారు.
కళ్యాణ్ రామ్ జంటగా కన్నడ భామ
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది.
ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'అమిగోస్' మీద మంచి అంచనాలు ఉన్నాయి.
Venkatesh's Saindhav Update : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!
Actress Hema: ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన నటి హేమ
‘రంగస్థలం’ + ‘బాహుబలి’ = నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ - చెప్పుకోండి చూద్దాం!
Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!