Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
లేటెస్ట్ సెన్సేషనల్ సూపర్ హిట్ ‘బలగం’ అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు రాత్రి నుంచి స్ట్రీమ్ కానుంది.
Balagam OTT: చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘బలగం’. మార్చి 3వ తేదీన వచ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి పదింతల లాభాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి రెడీ అవుతోంది. నేటి రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇప్పటికీ ఈ సినిమా ప్రతి రోజూ రూ. కోటి వరకు వసూలు చేస్తుంది. మరి ఓటీటీలో వస్తే ఆ ప్రభావం థియేటర్ల మీద పడుతుందా? లేక థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతూనే ఉంటారా అనేది ఈ వీకెండ్‌లోపు తేలిపోతుంది. ఈ సినిమా 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.21.73 కోట్ల గ్రాస్‌ను, రూ.9.92 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా బిజినెస్ రూ.1.15 కోట్లే కావడం విశేషం.
మార్చి 3వ తేదీన విడుదల అయిన ‘బలగం’ మూడు వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఓటీటీ డీల్ విడుదలకు ముందుగానే పూర్తి కావడంతో ఇంత త్వరగా సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంది అనుకోవచ్చు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందంటున్నారు. పల్లెటూరి ప్రేమలను, ఆప్యాయతలను ఈ చిత్రంలో బాగా చూపించారని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ నటించకపోయినా, కథలోని బలం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చక్కటి మౌత్ పబ్లిసిటీతో మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజు రోజుకు ఈ సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది.
సినిమా కథేంటి?
కొమురయ్య (సుధాకర్ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి) పెళ్ళి చేసుకోవాలి అనుకుంటాడు. రెండు రోజుల్లో నిశ్చితార్థం అనగా సాయలు తాత కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. అప్పటికే సాయిలు పూర్తిగా అప్పుల్లో ఉంటాడు. ఎంగేజ్ మెంట్ రోజు రూ. 10 లక్షల కట్నం వస్తే తన అప్పులు తీరుద్దాం అనుకుంటాడు. కానీ తన తాత చనిపోవడంతో సాయలు ఆశ నిరాశ అవుతుంది. చావు ఇంట్లో అప్పు వాళ్ల గొడవ కారణంగా పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది.
తాత చావుకు వచ్చిన మేనత్త కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్)ను చూసి లవ్ లో పడతాడు. ఆమె తండ్రికి కోటీశ్వరుడు అని తెలిసి ఎలాగైనా తనను పెళ్లి చేసుకుని అప్పుతీర్చుకోవాలని భావిస్తాడు. ఆ తర్వాత సంధ్యను ఎలా ప్రేమలో పడేశాడు? తన ప్రేమ కోసం చనిపోయిన తాతను ఎలా వాడుకుంటాడు? సంధ్య తల్లిదండ్రులు, సాయిలు మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి? చివరకు ఏమవుతుంది? అనేది సినిమా కథ.
టాలీవుడ్ సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సక్సెస్‌ఫుల్ టాక్ థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.