News
News
X

Prithiveeraj: 24 ఏళ్ల అమ్మాయితో పృథ్వీ సహజీవనం - పెళ్లి గురించి ఏమన్నారంటే?

మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న పృథ్వీ 23 ఏళ్ల మలేషియా అమ్మాయితో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. దీనిపై పృథ్వీ స్పందించారు.

FOLLOW US: 

నటుడు 'బబ్లూ' పృథ్వీరాజ్ ఓ యువతిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న పృథ్వీ 23 ఏళ్ల మలేషియా అమ్మాయితో ప్రేమలో పడ్డాడని కథనాలను ప్రచురించారు. తాజాగా ఈ వార్తలపై పృథ్వీ స్పందించారు. ఆమెకి 23 ఏళ్లు కాదని.. 24 ఏళ్లని చెప్పారు. అలానే ఆమె మలేషియాకి చెందిన అమ్మాయి కాదని.. తెలుగమ్మాయని చెప్పారు. 

ప్రేమ ఏ వయసులో పుడుతుందో చెప్పలేమని.. ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని అన్నారు. కర్ణాటకకు చెందిన పృథ్వీరాజ్ తెలుగులో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. 'పెళ్లి' సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత దాదాపు నలభై తెలుగు సినిమాల్లో నటించారాయన. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశారు. 

1994లో బీనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పృథ్వీరాజ్. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతడు వయసు 27 ఏళ్లు. అయితే కొన్నేళ్లుగా భార్యతో గొడవలు జరుగుతుండడంతో ఆమెకి దూరంగా ఉంటున్నారు పృథ్వీరాజ్. తన కొడుకుని మాత్రం నెలకు ఒకసారి కలుస్తానని చెప్పారు. భార్యకు దూరంగా ఉంటున్న పృథ్వీ.. 24 ఏళ్ల తెలుగమ్మాయి శీతల్ తో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం శీతల్ తో సహజీవనం చేస్తున్నట్లు పృథ్వీ తమిళ మీడియాకు వెల్లడించారు. 

56 ఏళ్ల పృథ్వీ 24 ఏళ్ల అమ్మాయితో సహజీవనం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే శీతల్ తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పారాయన. మొదట శీతల్ తో పెళ్లికి తను ఒప్పుకోలేదని.. బాగా ఆలోచించుకోమని చెప్పానని పృథ్వీ అన్నారు. కానీ ఆమె మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని చెప్పిందని.. ఆమె ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. 

News Reels

మొదటి భార్య బీనాకు రెండు నెలల క్రితం విడాకులు ఇచ్చానని చెప్పిన పృథ్వీ.. త్వరలోనే శీతల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. శీతల్ దృష్టిలో వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని.. ఆమె తనను బాగా చూసుకుంటుందన్న నమ్మకం ఉందని పృథ్వీ అన్నారు. శీతల్ తో ఒక బిడ్డను కూడా కనాలని ఉందని వెల్లడించారు పృథ్వీ. 

Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా

View this post on Instagram
 
A post shared by Babloo Prithiveeraj (@prithiveeraj)

Published at : 29 Oct 2022 06:31 PM (IST) Tags: Prithiveeraj Prithiveeraj girl friend Babloo Prithiveeraj love story

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !