News
News
X

‘అయ్యయ్యో’ అంటోన్న షణ్ముఖ్ జస్వంత్, మరో కొత్త బ్యూటీతో జోడి!

ఇటీవలే ‘జానూ’ వీడియో సాంగ్ చేసిన షణ్ముఖ్ తాజాగా ‘అయ్యయ్యో..’ అంటూ మరో కొత్త వీడియో సాంగ్ తో ముందుకు రానున్నాడు. షణ్ముఖ్ చేయబోతున్న సాంగ్ కు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను ఇటీవలెే విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎంతో మంది యూత్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ ను నిరూపిస్తూ దూసుకెళ్తున్నారు. అలా ఈ మధ్య చాలా మంది యువతీయువకులు సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నాడు. షణ్ముఖ్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. షార్ట్ ఫిల్మ్ లు, వెబ్ సిరీస్ లు, కవర్ వీడియో సాంగ్స్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. ఇటీవలే ‘జానూ’ వీడియో సాంగ్ చేసిన షణ్ముఖ్ తాజాగా ‘అయ్యయ్యో..’ అంటూ మరో కొత్త వీడియో సాంగ్ తో ముందుకు రానున్నాడు. షణ్ముఖ్ చేయబోతున్న సాంగ్ కు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను ఇటీవలెే విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇక ఈ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. వీడియో లో షణ్ముఖ్ డీసెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ ‘అయ్యయ్యో..’ మ్యూజిక్ వీడియోలో నటి ఫణి పూజిత షణ్మఖ్ తో జతకట్టింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ జోడి బాగుంది. తన ప్రేయసిని కలసుకోవడానికి పరితపించే ఓ ప్రేమికుడిలా షణ్ముఖ్ కనిపిస్తున్నాడు. ఇక ఈ మ్యూజిక్ వీడియోకు వినయ్ షణ్ముఖ్ దర్శకత్వం వహించగా ది ఫాంటిసియా మ్యాన్ సంగీతం అందించారు. ఈ పాటకు మ్యూజిక్ కూడా బాగుండటంతో ఈ వీడియో సాంగ్ పై ఆసక్తి నెలకొంది. మరి పూర్తి పాట ఎలా ఉంటుందో చూడాలి. 

ఇక షణ్ముఖ్ జస్వంత్ 2012 లో యూట్యూబ్ చానల్ ను ప్రారంభించాడు. తర్వాత 2013 లో వచ్చిన ‘ది వైవా’ వీడియోలో కనిపించాడు. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్ లు చేసి తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత తన యూట్యూబర్ దీప్తి సునయనతో పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించారు. వీరిద్దరి కాంబో కు మంచి పేరు వచ్చింది. తర్వాత షణ్ముఖ్ కె.సుబ్బు దర్శకత్వం వహించిన ‘సాఫ్ట్ వేర్ డవలపర్స్’ వెబ్ సిరీస్ లో షన్ను పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ బాగా హిట్ అవ్వడంతో షణ్ముఖ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత కూడా పలు మ్యూజిక్ వీడియోలు చేశాడు. తర్వాత ‘సూర్య’ వెబ్ సిరీస్ లో నటించాడు షణ్ముఖ్. 

ఇక షణ్ముఖ్ కొంత కాలం క్రితం వరకూ తన యూట్యూబ్ కోస్టార్ దీప్తి సునయన తో ప్రేమాయణం సాగించాడు. ‘బిగ్ బాస్ 5’ లో కన్స్టెంట్ గా చేశాడు. ఈ సమయంలో హౌస్ లో సిరి హనుమంతు తో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. దీంతో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షణ్ముఖ్ అలాగే దీప్తికు మనస్పర్థలు రావడం వలనే వారిద్దరూ విడిపోయారు అని అనుకుంటున్నారు అంతా. అయితే దీనిపై వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్నాళ్లుగా వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఒకటి రెండు సార్లు ప్రయివేట్ పార్టీలు, మీటింగ్ లలో కనిపించినా పలకరించుకోలేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ లోనే ఉన్నారనే కామెంట్లు వస్తున్నాయి. అయితే కొంత మంది షణ్ముఖ్, దీప్తి అభిమానులు మాత్రం మళ్లీ వీరిద్దరూ కలవాలని కోరుతున్నారు. 

Published at : 11 Mar 2023 09:28 PM (IST) Tags: Shanmukh Shanmukh Jaswant Ayyayyo Song Phanipoojitha

సంబంధిత కథనాలు

Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్

Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!