Kate Winslet Avatar 2 : 'అవతార్ 2'లో 'టైటానిక్' హీరోయిన్ ఉందా? కేట్ విన్స్‌లెట్‌ను ఎంత మంది గుర్తు పట్టారు?
'అవతార్ 2'లో 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ ఉన్నారు. ఆమె ఏ క్యారెక్టర్ చేశారనేది ఎంత మందికి తెలుసు? సినిమాలో ఆమెను ఎంత మంది గుర్తు పట్టారు?
కేట్ విన్స్‌లెట్ (Kate Winslet) కు హాలీవుడ్ సినిమాలు చూసే భారతీయులలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకు 'టైటానిక్' ఓ కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఆమె కోసమే కొంత మంది హాలీవుడ్ సినిమాలు చూశారు. అటువంటి అభిమానులను 'అవతార్ 2' (Avatar 2) డిజప్పాయింట్ చేసింది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
'అవతార్ 2' కేట్ విన్స్‌లెట్ ఎక్కడ?
'అవతార్ 2' చూసిన ప్రేక్షకులలో కొందరు కేట్ విన్స్‌లెట్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ఎందుకంటే... సినిమాలో వాళ్ళకు కేట్ కనిపించలేదు. దీనికి కారణం... మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో సినిమా తీయడం, పండోరా గ్రహం మీద సముద్రపు తెగ 'రీఫ్ జాతి' నాయకురాలిగా కేట్ విన్స్‌లెట్ కనిపించడం!
రొనాల్... కేట్... ఒక్కరే!
ఇప్పటి వరకు కేట్ విన్స్‌లెట్ తెరపై అందంగా, ఆమె రూపంలో కనిపించారు. ఈ సినిమాలో మాత్రం రొనాల్ పాత్రలో పండోరా గ్రహం మీద రీఫ్ జాతి మనిషిగా కనిపించారు. పైన ఫోటో చూశారా? అందులో నీలి రంగులో ఉన్న మహిళే కేట్. ఆ రూపంలో ఉండటం వల్ల ఆమెను చాలా మంది గుర్తు పట్టలేదు. సినిమా మొత్తం చూశాక... లేదంటే సినిమా చూస్తున్నప్పుడు... స్నేహితులను కేట్ విన్స్‌లెట్ ఎక్కడ? అని ప్రశ్నించారు.
కేట్ విన్స్‌లెట్‌ను తీసుకోవడం ఎందుకు?
రొనాల్ క్యారెక్టర్ చేసింది కేట్ విన్స్‌లెట్ అని తెలిశాక... భారతీయ ప్రేక్షకులలో కొంత మంది బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆ మాత్రం దానికి కేట్ విన్స్‌లెట్‌ను తీసుకోవడం ఎందుకు? అని క్వశ్చన్ చేశారు. అదీ సంగతి!
టామ్ క్రూజ్ రికార్డ్ బ్రేక్ చేసిన కేట్!
సిల్వర్ స్క్రీన్ మీద కేట్ విన్స్‌లెట్ రూపం కనిపించకపోవచ్చు. కానీ, ఆ క్యారెక్టర్ చేసింది ఆవిడే. రొనాల్ పాత్రలో నటించడం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఎంత? అంటే... అండర్ వాటర్ సీన్స్ కోసం 15 నిమిషాలు నీళ్లలో ఉండేంత! ఇంతకు ముందు ఓ సినిమా కోసం టామ్ క్రూజ్ సుమారు ఆరు నిమిషాల పాటు నీళ్ళలో ఉన్నారట. ఆ రికార్డును కేట్ బ్రేక్ చేశారని హాలీవుడ్ మీడియా ప్రశంసిస్తూ వార్తలు రాస్తోంది. రికార్డు బ్రేక్ చేసిన విషయం తనకు తెలియని కేట్ చెప్పారు. కేట్ విన్స్‌లెట్ మాత్రమే కాదు... నావి జాతి మనుషులుగా నటించిన వ్యక్తులు పేర్లు చెబితే తప్ప కొంత మంది గుర్తు పట్టలేరు. వాళ్ళు పడిన కష్టం వృథా కాకూడదని ఆశిద్దాం!
Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?
తెలుగులో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మన దేశంలో 'అవతార్ 2' ఓపెనింగ్స్ చూస్తే సగం కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉన్నాయట. సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే... మిక్స్డ్ టాక్ లభిస్తోంది. విజువల్స్ విషయంలో యునానిమస్ పాజిటివ్ టాక్ వినబడుతోంది. కథ విషయానికి వస్తే... చాలా మంది పెదవి విరుస్తున్నారు. అదీ సంగతి! వీకెండ్ తర్వాత సినిమాకు ఎటువంటి టాక్ వస్తుందో చూడాలి. కలెక్షన్స్ అయితే రావచ్చు కానీ అందరినీ సినిమా శాటిస్‌ఫై చేయడం కష్టం అని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : దేవతలు అసురుల కథనే జేమ్స్ కామెరూన్ తీసుకున్నారా?