News
News
X

Avatar 2 Day 1 Collection : ఇండియాలో 'అవతార్ 2' కలెక్షన్లు - 17 కోట్లలో 6 కోట్లు తెలుగు ప్రేక్షకుల డబ్బే

తెలుగు ప్రేక్షకులు సినిమా అభిమానులు అని మరోసారి రుజువైంది. కంటెంట్ ఉన్న సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారని 'అవతార్ 2' వసూళ్ళు చెబుతున్నాయి.

FOLLOW US: 
Share:

తెలుగు ప్రేక్షకులు సినిమా అభిమానులు అని మరోసారి రుజువైంది. 'అవతార్ 2'  సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే (Avatar 2 Movie Telugu Release). కంటెంట్ ఉన్న సినిమాలను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాకు తెలుగు నాట వస్తున్న వసూళ్ళు చెబుతున్నాయి.

ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఇండియాలో 'అవతార్ 2' తొలి రోజు భారీ వసూళ్ళు నమోదు చేసే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే... పదిహేడు కోట్లకు పైగా ఫస్ట్ డే గ్రాస్ రావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అందులో ఆరు కోట్ల గ్రాస్ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా అని టాక్.

టికెట్లు పరంగా చూస్తే సగం మనవే!
పదిహేడు కోట్ల రూపాయలలో ఆరు కోట్లు అంటే పర్సంటేజ్ తక్కువ అని చాలా మందికి అనిపించవచ్చు. కానీ, టికెట్స్ పరంగా చూస్తే... సగం మనవే. ఇప్పటి వరకు 'అవతార్ 2'ను చూడాలని ఆరున్నర లక్షల మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్మిన టికెట్లు ఇవి. అందులో మూడు లక్షల టికెట్లు తెలుగు ప్రేక్షకులవి. అదీ సంగతి! 

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రేక్షకులు 'అవతార్ 2' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు భారతీయ ప్రేక్షకులు ఏమీ అతీతం కాదు. ఇండియాలో ఇంకా జేమ్స్ కామరూన్ సృష్టించిన విజువల్ వండర్ విడుదల కాలేదు. ముంబైలో హిందీ చలన చిత్ర పరిశ్రమలో కొందరు తారలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేశారు. వాళ్ళు అందరూ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. 

Also Read : నేను బతికే ఉన్నా - నటి వీణా కపూర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్

ఇండియాలోని థియేటర్లలో 'అవతార్ 2' విడుదలకు ముందు సినిమా ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. డౌన్ లోడ్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ & ఫ్యామిలీలకు కూడా సెండ్ చేస్తున్నారట. ఇలాంటి విజువల్ వండర్‌ను పైరసీ కంటే థియేటర్లలో చూడాలని సినిమా ప్రేమికులు చెప్పే మాట.

నెగిటివ్ రివ్యూలు రావడం మైనస్ అవుతుందా?
పైరసీకి తోడు నెగిటివ్ రివ్యూలు రావడం 'అవతార్ 2'కు మైనస్ అవుతుందా? అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే... ఆల్రెడీ లండన్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొన్న హైప్‌కు తగ్గట్టు సినిమా లేదని చూసిన వాళ్ళు చెబుతున్నారు.  

అవసరాల మాటల్లో 'అవతార్ 2'
అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కథానాయకుడు మాత్రమే కాదు... హీరో కంటే ముందు ఆయనలో రచయిత ఉన్నాడు. తెలుగు భాషా ప్రేమికుడు ఉన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే చాలు... అవసరాల తెలుగు ఎంత స్పష్టంగా, డైలాగులు ఎంత సూటిగా ఉంటాయో ఉంటుందో తెలుస్తుంది. అందుకే, ఆయన చేత 'అవతార్ 2'కి డైలాగులు రాయించినట్టు ఉన్నారు.

Published at : 15 Dec 2022 04:15 PM (IST) Tags: Avatar The Way of Water Avatar Sequel Avatar 2 Collections Avatar 2 Review Telugu Avatar 2 AP TS Collection

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం