Venu Swamy Prediction: రాజకీయాల్లోకి అనసూయ - వేణుస్వామి జాతకం నిజమయ్యేనా?
యాంకర్ అనసూయ ఏడుస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో జ్యోతిష్యుడు వేణుస్వామి ఆమె గురించి గతంలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తన పాపులారిటీని జబర్దస్త్ పెంచుకున్న ఆమె, ఆ తర్వాత బుల్లితెరను వదిలి వెండితెరపైకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. రీసెంట్ గా వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో నెగిటివిటీని తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత 'అరే ఏంట్రా మీరంతా?' అంటూ ఆమె కొత్త వీడియో పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైరల్ అవుతున్న వేణుస్వామి ఓల్డ్ వీడియో
అనసూయ తాజా వీడియో నేపథ్యంలో జోతిష్యుడు వేణు స్వామి ఆమె గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనసూయ జాతకం ప్రకారం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2021 తర్వాత ఆమె జాతకం పూర్తిగా మారిపోయే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఆమె పట్టిందల్లా బంగారం అవుతుందన్నారు. సినీ పరిశ్రమలో టాప్ రేంజికి ఎదుగుతుందన్నారు. ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
2021 నుంచి పెరిగిన అనసూయ పాపులారిటీ
వాస్తవానికి వేణు స్వామి చెప్పినట్లుగానే 2021 తర్వాత అనసూయ పాపులారిటీ మరింత పెరిగింది. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. చాలా మంది వేణు స్వామి చెప్పినట్లుగానే అనసూయ జీవితం మలుపులు తిరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.
యాంకర్ గా, నటిగా చక్కటి గుర్తింపు
న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ, నెమ్మదిగా బుల్లితెరపై రాణించింది. ‘జబర్దస్త్’ షోతో ఆమె రేంజి పెరిగిపోయింది. తన అందం చందాలతో పాటు చలాకీ మాటలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. అమ్మడు గ్లామర్ ట్రీట్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. కొన్ని సంవత్సరాల పాటు యాంకర్ గా బుల్లితెరను షేక్ చేసింది. ఈ మధ్యే ‘జబర్దస్త్’ షోకు గుడ్ డై చెప్పింది. సినిమాల్లోకి అడుగు పెట్టింది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.
‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రతో ఆకట్టుకున్న అనసూయ, ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘పుష్ప2’ చిత్రంలోనూ నటిస్తోంది. సుమార్ ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ను మరింత హైలెట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘విమానం’ చిత్రం విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఓటీటీలోనూ ఆడియెన్స్ ను అలరించింది.
Read Also: నా మోకాళ్లు చూసి అక్షయ్ అవమానించాడు - భానుప్రియ సోదరి శాంతి ప్రియా షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial