Ashu Reddy As Heroine: హీరోయిన్‌గా అషూ రెడ్డి! లవర్స్ డేకి కొత్త లుక్‌తో వచ్చింది చూశారా?
'బిగ్ బాస్'తో బుల్లితెర వీక్షకుల్లో పాపులర్ అయిన అషూ రెడ్డి, ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.
![Ashu Reddy As Heroine: హీరోయిన్‌గా అషూ రెడ్డి! లవర్స్ డేకి కొత్త లుక్‌తో వచ్చింది చూశారా? Ashu Reddy as heroine in Telugu movie Focus Ashu Reddy valentine day special poster released from focus movie Ashu Reddy As Heroine: హీరోయిన్‌గా అషూ రెడ్డి! లవర్స్ డేకి కొత్త లుక్‌తో వచ్చింది చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/14/b43380cfb5bd5ef0d8484200ff02a23d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అషూ రెడ్డి అంటే బుల్లితెర వీక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'బిగ్ బాస్' రియాలిటీ షో. తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 3లో ఆవిడ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ, బుల్లితెరపై రెండు మూడు కార్యక్రమాల్లో యాంకరింగ్ చేయడం ద్వారా లైమ్ లైట్‌లో ఉంటున్నారు. 'బిగ్ బాస్'కు రాకముందు కూడా అషూ రెడ్డి పాపులరే. సోషల్ మీడియాలో ఆమెకు జూనియర్ సమంత అని పేరుంది. ఇప్పుడీ భామ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది.
త్వరలో అషూ రెడ్డి హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ శంకర్ హీరోగా సూర్యతేజ దర్శకత్వం వహించిన సినిమా 'ఫోకస్'. ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని, మర్డర్ మిస్టరీ అని యూనిట్ చెబుతోంది. ఇందులో అషూ రెడ్డి హీరోయిన్. ఈ రోజు వాలంటైన్స్ డే సందర్భంగా 'ఫోకస్' మూవీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. త్వరలో విడుదల తేదీ వివరాలు ప్రకటిస్తామని యూనిట్ అంటోంది. ఇందులో సుహాసిని మణిరత్నం న్యాయమూర్తిగా కీలక పాత్రలో, విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోగా నటిస్తున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర తారాగణం.
Also Read: అతిలోక సుందరిలా అరియానా గ్లోరీ... అషూ రెడ్డి ముద్దు... ఆర్జీవీని ట్రోల్ చేస్తున్న జనం!
నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన 'చల్ మోహన్ రంగ'లో అషూ రెడ్డి ఓ పాత్ర చేశారు. అయితే... కథానాయికగా కాదు, హీరోయిన్ స్నేహితురాలిగా! 'హ్యాష్ ట్యాగ్ పీకే' అనే సినిమాలో కథానాయికగా చేశారట. అయితే... ఆ సినిమా కంటే 'ఫోకస్' ముందుగా విడుదల కానుంది.
Also Read: పెళ్లి ఎందుకు కాలేదు ప్రభాస్? - పూజా హెగ్డే ప్రశ్న! 'రాధే శ్యామ్' వాలంటైన్ గ్లింప్స్ చూశారా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)