Ashish Vidyarthi Wedding: 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి - పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
అనేక ప్రతినాయక పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆశిష్ విద్యార్థి 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు.
Ashish Vidyarthi 2nd Marriage: అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో ప్రతినాయక పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బరువాతో ఆశిష్ విద్యార్థి ఏడు అడుగులు వేశారు.
వైరల్‌గా మారిన ఫొటో
ఆశిష్ విద్యార్థి, రూపాలి బరువా మే 25వ తేదీన తమ సన్నిహితుల సమక్షంలో కోర్టులో వివాహం చేసుకున్నారు. వీరి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు.
కోల్‌కతాలో ఆశిష్, రూపాలి వివాహం
ఆశిష్ విద్యార్థి, రూపాలి బరువా కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. రూపాలి ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన వ్యక్తి. కోల్‌కతాలో వీరికి ఫ్యాషన్ స్టోర్ కూడా ఉందని తెలుస్తోంది. అందుకేనేమో పెళ్లి దుస్తులు కూడా అందంగా డిజైన్ చేసుకున్నారు. ఈ ఫొటోల్లో ఆశిష్ ఆఫ్ వైట్ కుర్తాను ధరించారు. మరోవైపు రూపాలి బరువా కూడా వైట్ షేడ్ చీరలో చాలా అందంగా ఉంది. ఫోటోల్లో ఇద్దరూ తమ మెడలో దండలు ధరించి కెమెరాకు పోజులిచ్చారు.
ఆశిష్‌కు రెండో వివాహం
రూపాలి బరువా కంటే ముందే ఆశిష్ నటి రాజోషి విద్యార్థిని వివాహం చేసుకున్నారు. రాజోషి నటి, గాయని, థియేటర్ ఆర్టిస్ట్. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ఆశిష్ విద్యార్థి రెండో విద్యార్థి రెండో వివాహం చేసుకున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే... ఆశిష్ విద్యార్థి తెలుగులో చివరిగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో కనిపించారు. ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో కూడా ఆశిష్ నటించారు. దీంతోపాటు హిందీ సినిమా ‘ఖుఫియా’లో కూడా నటించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మొత్తం 11 భాషల్లో 200కు పైగా చిత్రాల్లో ఆశిష్ విద్యార్థి నటించారు.
Ashish Vidyarthi gets married to Assam's Rupali Barua at 60! pic.twitter.com/6EFQrU1mNo
— Christopher Kanagaraj (@Chrissuccess) May 25, 2023
Congratulations to 60 years old actor Ashish Vidyarthi who got married second time. Kucch to Sharam Kar lete Bhaisaab! pic.twitter.com/15cOyRYQd1
— KRK (@kamaalrkhan) May 25, 2023
Best wishes to both of them!! It’s really disgusting to read few comments on them… it’s their life their choice…#AshishVidyarthi pic.twitter.com/LE0CgWwMMR
— Rana (@Tha_rana) May 25, 2023
#AshishVidyarthi gets married at 60. pic.twitter.com/RdbwcifsL9
— Manobala Vijayabalan (@ManobalaV) May 25, 2023
Veteran Actor #ashishvidyarthi Gets Married To Fashion Entrepreneur Rupali Barua At 60 https://t.co/awjXZaF3Mq
— ABP LIVE (@abplive) May 25, 2023
The wait is over! 🎉
— Mamaraazzi (@mamaraazzi) May 25, 2023
Ashish Vidyarthi has finally found his 'happily ever after' as the knot with his lady love at the age of 60!
Wish them both a lifetime of love and joy 👇#AshishVidyarthi #Mariage #Mamaraazzi pic.twitter.com/lU6PDR9BDi