By: ABP Desam | Updated at : 02 Mar 2023 09:32 PM (IST)
కస్టడీ సినిమాలో అరవింద్ స్వామి లుక్ (Image Credits: Srinivasaa Silver Screen Twitter)
నాగ చైతన్య హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కస్టడీ’. ఇందులో ప్రతినాయకుడిగా ఒకప్పటి హీరో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ‘ధృవ’ తర్వాత అరవింద్ స్వామి కనిపించనున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే.
‘కస్టడీ’ సినిమాలో అరవింద్ స్వామి ‘రాజు’ అనే ఖైదీగా కనిపించనున్నాడు. చేతికి సంకెళ్లతో, నోట్లో సిగరెట్‌తొ రగ్డ్ లుక్‌లో అరవింద్ స్వామిని చూడవచ్చు. నాగ చైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. సమ్మర్ స్పెషల్‌గా మే 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగ చైతన్య తొలి స్ట్రయిట్ తమిళ సినిమా ఇదే.
Watch out for his Menacing Way!❤️🔥
Introducing the Enigmatic @thearvindswami as "Raju aka Raazu"#Custody - A @vp_offl HUNT 🎯#CustodyOnMay12@chay_akkineni @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar @SS_Screens #Priyamani #SampathRaj @srkathiir pic.twitter.com/ik5hueIrdD— Srinivasaa Silver Screen (@SS_Screens) March 2, 2023
తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు మూవీ టీమ్ అంతా కలసి ఓ ఫన్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మూవీ మే 12 న విడుదల అవుతుందని, అందరం మళ్లీ థియేటర్స్ లో కలుద్దాం అంటూ ఓ వీడియోను చేశారు. ఈ వీడియోను నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ ‘కస్టడీ’ మూవీను గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించారు. అప్పటి నుంచి విరామం లేకుండా షూటింగ్ జరిగింది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ ను కూడా ముగించింది మూవీ టీమ్. ఇక ఈ మూవీ షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండనుంది. ఇందుకోసం దాదాపు 3 నెలలు సమయం పడుతుందని ముందే అనుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అటు ఇటుగా మూడు నెలల తర్వాత మే 12 న మూవీ ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని గతంలో కూడా వెల్లడించారు. తాజాగా చైతన్య విడుదల చేసిన వీడియోలో కూడా అదే తేదీన మూవీను విడుదల చేయనునన్నట్లు ప్రకటించారు.
ఈ మూవీకు సంబంధించిన అన్ని అప్డేట్ లను జాగ్రత్తగా రివీల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. మొదట విడుదల చేసిన పోస్టర్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా ‘కస్టడీ’ గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ గ్లింప్స్ వీడియోలో నాగ చైతన్య మాస్ లుక్ లో అదరగొట్టాడనే చెప్పాలి. నాగ చైతన్య ఇంతకు ముందు కొన్ని మాస్ సినిమాలు చేశారు. అయితే, 'ఈ సినిమాలో మాత్రం ఆయన యాక్షన్ పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. మరి నాగ చైతన్య ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ మాస్ హిట్ ఈ సినిమాతో అందుతుందో లేదో చూడాలి.
విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో నాగచైతన్య ఎప్పుడూ కొత్తగానే ఆలోచిస్తారు. ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. గతంలో ‘బంగార్రాజు’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు నాగచైతన్య. ఈ మూవీ లో చై, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఈ జంట కలసి నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఇద్దరు స్టార్ సంగీత దర్శకులు కూడా కలసి పనిచేస్తుండటం విశేషం. ఇక ఈ మూవీలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటీనటులు కనిపించనున్నారు.
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?
Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం