అన్వేషించండి

Arjun Kapoor- Malaika Arora: మలైకా అరోరాతో బ్రేకప్ నిజమేనా? ఫైనల్లీ... అసలు విషయం చెప్పిన అర్జున్ కపూర్

Malaika Arora Arjun Kapoor: మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పినట్లు వస్తున్న వార్తలపై అర్జున్ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన, తాజాగా అసలు విషయం చెప్పారు.

Arjun Kapoor-Malaika Arora Breakup: బాలీవుడ్ స్టార్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా బ్రేకప్ చెప్పుకున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ఎవరి లైఫ్ వారు చూసుకున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ కపూర్ అసలు విషయం చెప్పారు. దీపావళి బాష్ లో మలైకాతో బ్రేకప్ ను కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉంటున్నట్లు వెల్లడించారు. ముంబైలోని శివాజీ పార్క్‌ లో రాజ్ థాకరే నిర్వహించిన దీపావళి పార్టీలో ‘సింగమ్ ఎగైన్’ టీమ్ పాల్గొన్నది. అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దర్శకుడు రోహిత్ శెట్టి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అర్జున్ కపూర్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. మైక్ పట్టుకోగానే చుట్టుపక్కల వారు మలైకా.. మలైకా అని అరిచారు. వెంటనే అతడు “నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. ఎవరితో కలిసి లేను" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలైకాతో బ్రేకప్ రూమర్స్ వచ్చిన తర్వాత అర్జున్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి.  

 2018 నుంచి మలైకా, అర్జున్ డేటింగ్..

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాతో యంగ్ హీరో అర్జున్ కపూర్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా ప్రేమలో పడ్డారు.  తరచుగా పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేసే వాళ్లు. హాలీడే ట్రిప్స్ కు వెళ్లేవారు.  ఇద్దరూ తమ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకునేవారు. గత కొద్ది కాలంగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఎవరూ తమ ప్రేమ బ్రేకప్ గురించి మాట్లాడలేదు. ఇటీవల మలైకా అరోరా తండ్రి అనిల్ చనిపోయినప్పుడు.. అర్జున్ కపూర్ దగ్గరుండి ఆయన అంతిమ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఒక్కటయ్యారనే వార్తలు వచ్చాయి. తాజాగా దీపావళి బాష్ లో అర్జున్ కపూర్ తాను ఒంటరిగానే ఉన్నానని చెప్పడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు నిజం అని తేలిపోయాయి.

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా- మలైకా

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా కీలక విషయాలు వెల్లడించారు. “నాపై వచ్చే విమర్శలు నన్ను ఎప్పుడూ బాధ కలిగించలేదు. ప్రతికూల అంశాల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రస్తుతం పర్సనల్ గా, కెరీర్ పరంగా మంచి పొజిషన్ లోనే ఉన్నాను. నా జీవితంలో జరిగిన మంచి, చెడు, రెండింటికీ నేను తీసుకున్న నిర్ణయాలే కారణం” అన్నారు. ఇన్ డైరెక్ట్ గా తన బ్రేకప్ గురించే చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

త్వరలో ‘సింగమ్ ఎగైన్’ విడుదల

అర్జున్ కపూర్ త్వరలో ‘సింగమ్ ఎగైన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ నటించారు. ‘సింగమ్ ఎగైన్’ సినిమా ‘భూల్ భూలయ్యా 3’తో కలిసి నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

Read Also: రివ్యూ రైటర్లకు శ్రీకాంత్ అయ్యంగార్ సారీ చెప్పారా? లేదంటే మీ పని చెబుతా అని బెదిరిస్తున్నారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
Embed widget