AR Rahman Birthday Special: రెహమాన్ కి ఆస్కార్ అందించిన “జై హో” సాంగ్ అసలు ఎవరి కోసం కంపోజ్ చేశాడో తెలుసా..
'ది మొజార్ట్ ఆఫ్ మద్రాస్' అని పిలిచే AR రెహమాన్ జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా రెహమాన్ గురించి పది ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
ఏఆర్ రెహమాన్ ఇది పేరు కాదు... మ్యూజిక్‌తో మాయ చేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఓ బ్రాండ్. భారత చిత్రపరిశ్రమలతో పాటు హాలీవుడ్‌లోనూ ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను, ఎవరికీ దక్కని రికార్డులను కైవసం చేసుకున్న రెహమాన్ 6 జనవరి 1967న భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో జన్మించారు.
1. రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. హిందూ కుటుంబంలో జన్మించిన దిలీప్.. 23 సంవత్సరాల వయసులో తన ఆధ్యాత్మిక గురువు ఖాద్రీ ఇస్లాంను కలుసుకున్న తర్వాత ఇస్లాంను స్వీకరించాడు.
2. రెహమాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందు దూరదర్శన్ వండర్ బెలూన్‌లో కనిపించాడు. ఒకేసారి 4 కీబోర్డులు ప్లే చేయగల చిచ్చరపిడుగుగా పేరుతెచ్చుకున్నాడు.
3. రెహమాన్‌లోని ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి మణిరత్నం. 1992లో రోజా సినిమాతో ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించిన రెహమాన్ తొలిసారి 25 వేల రూపాయలు పారితోషికం పొందాడు. అలా మొదలైన ప్రయాణం భారతీయులు గర్వించే స్థాయికి చేరింది.
4. ఏఆర్ రెహమాన్ భార్య పేరు సైరా బాను. రెహమాన్‌కి సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు – ఖదీజా, రహీమ్, అమన్.
5.‘స్లమ్‌డాగ్ మిలియనీర్’సినిమాకి ఏడాదిలో 2 ఆస్కార్‌లు గెలుచుకున్న మొదటి భారతీయుడు AR రెహమాన్. పద్మభూషణ్ , పద్మశ్రీ తో పాటూ 4 జాతీయ అవార్డులు అందుకున్నాడు రెహమాన్.
6. రెహమాన్ కి ఆస్కార్ అందించిన “జై హో” సాంగ్ సల్మాన్ ఖాన్ నటించిన 'యువరాజ్' సినిమా కోసం కంపోజ్ చేశాడట.
7. స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో పాటు, 127 అవర్స్ , లార్డ్ ఆఫ్ వార్ వంటి ఇతర హాలీవుడ్ చిత్రాలకు కూడా రెహమాన్ స్వరాలందించాడు.
8. AR రెహమాన్ మిక్ జాగర్, డేవ్ స్టీవర్ట్ ,జాస్ స్టోన్‌లతో కలిపి సూపర్ హెవీ పేరుతో పూర్తిగా భిన్నమైన సంగీతాన్ని పరిచయం చేశారు.
9. రెహమాన్ ని గౌరవించేందుకు కెనడాలోని ఒంటారియోలోని మార్ఖమ్‌లోని ఒక వీధికి రెహమాన్ పేరు పెట్టారు.
10. రెహమాన్ కంపోజ్ చేసిన ఎయిర్‌టెల్ సిగ్నేచర్ ట్యూన్ 150 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన మొబైల్ మ్యూజిక్‌గా చెబుతారు.
ప్రస్తుతం రెహమాన్ ప్రపంచంలోని టాప్ 10 స్వరకర్తలలో ఒకరు. ఇటీవల అతను అక్షయ్ కుమార్ చిత్రం ‘అత్రంగి రే’కి కూడా సంగీతం అందించాడు
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..