అన్వేషించండి

Eiffel Tower : వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!

Eiffel Tower : పారిస్ ఐకానిక్ చిహ్నమైన ఈఫిల్ టవర్‌ మెట్ల భాగాన్ని వేలం వేయనున్నారు. ఇది 137ఏళ్ల నాటిదని చెబుతున్నారు. లిఫ్టు ఏర్పాటుతో అప్పట్లో దాన్ని తొలగించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈఫిల్ టవర్ అసలైన మెట్ల భాగాన్ని వేలం వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
  • 137 ఏళ్ల నాటి ఈ చారిత్రక మెట్లు 2026 మే 21న వేలం జరుగుతుంది.
  • 1983లో లిఫ్టుల ఏర్పాటుతో ఈ మెట్లను తొలగించారు, ఇప్పుడు వేలం వేస్తున్నారు.
  • గతంలో వేలం వేసిన మెట్లు భారీ ధరలకు అమ్ముడయ్యాయి.

Eiffel Tower : ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచే పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ చరిత్రలో మరో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. ఈ టవర్ నిర్మించిన కాలం నాటి అసలైన మెట్ల భాగాన్ని వేలం వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 137 ఏళ్ల నాటి ఈ చారిత్రక అవశేషం కేవలం ఇనుప ముక్క మాత్రమే కాదు, అది నాటి ఇంజినీరింగ్ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యం. 

వేలం ఎప్పుడు వేస్తారు?

ప్రముఖ ఫ్రెంచ్ వేలం సంస్థ ఆర్ట్‌క్యురియల్‌, 2026 మే 21న ఈ వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలంలో విక్రయించబోయే మెట్ల భాగం సుమారు8.5 నుంచి 9 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఇందులో మొత్తం 14మెట్లు వృత్తాకారంలో అమర్చారు. ఈ విభాగం టవర్‌ రెండో, మూడో అంతస్తులను కలుపుతూ ఉండే అసలైన మెట్ల మార్గంలో భాగంగా ఉండేది. 

ఎందుకు మెట్లు తొలగించారు?

చారిత్రక విలువ వల్లే కాకుండా దాని నిర్మాణ శైలి వల్ల కూడా ప్రాముఖ్యత పొందుతుంది. రివెటెడ్‌ షీట్ మెటల్ సిలిండర్‌పై అమర్చిన ఈ మెట్లు ఈఫిల్‌ టవర్ అసలైన గోధుమ రంగులో పునరుద్ధరించారు. ఈఫిల్ టవర్ నిర్మించిన సమయంలో పై అంతస్తు చేరుకోవడానికి 1701 మెట్లు ఉండేవి. కాలక్రమేణా పర్యాటకుల సౌకర్యార్థం లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1983లో టవర్‌పై అంతస్తులకు చేరుకోవడానికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే టవర్ పైభాగంలో ఉన్న హెలికల్ మెట్ల మార్గాన్ని తొలగించాల్సి వచ్చింది.

ఇప్పటి వరకు ఎప్పుడైనా వేేలం వేశారా? 

అప్పట్లో అధికారులు ఈ మెట్ల మార్గాన్ని 24 విభాగాలుగా విభజించారు. ఒక విభాగాన్ని టవర్ మొదటి అంతస్తులో ప్రదర్శన కోసం మూడో విభాగాలను ఫ్రాన్స్‌లో ప్రముఖ మ్యూజియంలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మిగిలిన 20 విభాగాలను 1983డిసెంబర్‌లో వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఇప్పుడు వేలం వేయబోతున్నది మొదటి విభాగంలోనిదే. 

గత రికార్డులు ఏం చెబుతున్నాయి. 

ఈ వేలానికి ముందు దీని ధరను సుమారు నలభై వేల నుంచి యాభై వేల యూరోలుగా అంటే దాదాపు 50 లక్షలుగా అంచా వేశారు. అయితే గత చరిత్రను పరిశీలిస్తే ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2016లో ఒక మెట్ల విభాగం ఏకంగా 5, 23, 800 యూరోలకు అంటే ఐదు కోట్లకుపైగా అమ్ముడైంది. 2020లో వేలం వేసిన మరో విభాగం సుమారు 2-7 కోట్లకుపైగా ధర పలికింది. 

ఈ మెట్ల విభాగాలు ఇప్పుడు కేవలం ప్రాన్స్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. కొన్ని జపాన్‌లోని యోషీ ఫౌండేషన్‌లో, మరికొన్ని న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ‌ లిబర్టీ సమీపంలోని, డిస్నీల్యాండ్‌లో కూడా నిపిస్తాయి. 

ఒక ఎగ్జిబిషన్ కోసం నిర్మించిన ఈ ఈఫిల్ టవర్ నేటికీ ప్రపంచ పర్యాటకులను అలరిస్తోంది. దీన్ని గుస్తావ్ ఈఫిల్ అనే వ్యక్తం రెండు సంవత్సరాల్లోనే నిర్మించారు. గాలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రత్యేకమైన స్ట్రక్చర్ ప్రిన్సిపల్‌ ను ఉపయోగించారు. నిటారుగా చూస్తే టవర్ కాస్త వంగినట్టు ఉంటుంది. ఇది గాలి ఒత్తిడి తట్టుకోవడానికి ఇలా నిర్మించారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే ఎత్తైన కట్టడంగా ఉండేది. ఈ వింతైన ఆకారాన్ని చూసి చాలా మంది విమర్శలు చేశారు. కానీ కాలక్రమేణా ఈ నిర్మాణ మేధస్సు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. 

Frequently Asked Questions

ఈఫిల్ టవర్ యొక్క అసలైన మెట్ల భాగం ఎప్పుడు వేలం వేయబడుతుంది?

ఈఫిల్ టవర్ యొక్క అసలైన మెట్ల భాగం మే 21, 2026న వేలం వేయబడుతుంది. ప్రముఖ ఫ్రెంచ్ వేలం సంస్థ ఆర్ట్‌క్యురియల్‌ ఈ వేలాన్ని నిర్వహిస్తుంది.

వేలం వేయబోయే మెట్ల భాగం ఎంత ఎత్తు ఉంటుంది?

వేలం వేయబోయే మెట్ల భాగం సుమారు 8.5 నుంచి 9 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇందులో మొత్తం 14 వృత్తాకార మెట్లు ఉంటాయి.

ఈఫిల్ టవర్ నుండి మెట్లను ఎందుకు తొలగించారు?

పర్యాటకుల సౌకర్యార్థం లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి రావడంతో 1983లో ఈ మెట్ల మార్గాన్ని తొలగించారు. ఆ సమయంలో టవర్ పై అంతస్తులకు లిఫ్టులు ఏర్పాటు చేశారు.

గతంలో ఈఫిల్ టవర్ మెట్ల విభాగాలు ఏ ధరకు అమ్ముడయ్యాయి?

2016లో ఒక మెట్ల విభాగం 5,23,800 యూరోలకు (5 కోట్లకుపైగా) అమ్ముడైంది. 2020లో మరో విభాగం 2-7 కోట్లకుపైగా ధర పలికింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget