అన్వేషించండి

Carmeni Selvam Review - 'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?

Carmeni Selvam Review In Telugu: సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన 'కార్మేని సెల్వం' సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మిడిల్ క్లాస్ కష్టాలు, అప్పులపై తీసిన సినిమా ఎలా ఉందంటే?

Samuthirakani's Carmeni Selvam Telugu Review: విలక్షణ నటుడు - దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కార్మేని సెల్వం'. ఆయన భార్యగా లక్ష్మీ ప్రియా నటించగా... కీలక పాత్రల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ, కార్తీక్ కుమార్ నటించారు. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు నిర్మించిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Carmeni Selvam Movie Story): సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) దగ్గర సెల్వం (సముద్రఖని) డ్రైవర్. అతని భార్య శాంతి (లక్ష్మీ ప్రియా), ఇంటి దగ్గర రోడ్డు పక్కన ఇడ్లీ కొట్టు పెట్టుకుని భర్తకు అండగా నిలబడుతుంది. సెల్వం చెల్లెలు ఇంటిలో ఫంక్షన్ ఉంటే... కుటుంబమంతా వెళుతుంది. అక్కడ ఎదురైన చేదు అనుభవం కారణంగా డబ్బులు సంపాదించాలని సెల్వానికి భార్య చెబుతుంది. సరిగ్గా ఆ సమయంలో సంపత్ విదేశాలు వెళ్లడంతో ఆయన కారును రెంటల్‌ క్యాబ్‌గా మారుస్తాడు. క్యాబ్ మీద వచ్చిన డబ్బులు కాకుండా అప్పులు చేసి, క్రెడిట్ కార్డులు వాడి విలాసవంతమైన జీవితం గడుపుతాడు. ఆ తర్వాత ఏమైంది?

కారును రెంటల్ క్యాబ్‌గా మార్చిన సంగతి సంపత్‌కు తెలిసిందా? లేదా? సెల్వం అప్పులు చేస్తూ వెళుతుంటే భార్య ఏం చేసింది? అప్పుల ఊబిలో కూరుకుపోయాక సెల్వం ఏం చేశాడు? ఏం తెలుసుకున్నాడు? చివరకు బోధపడిన తత్త్వం ఏమిటి? అనేది సినిమా.

విశ్లేషణ (Carmeni Selvam Telugu Review): అనవసరమైన వాటి కోసం ఖర్చు చేస్తే అవసరమైన వాళ్ళను కోల్పోతాం - క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ 'కార్మేని సెల్వం'లో ఇచ్చిన సందేశం. అప్పులు చేయడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డాయి? అనే కథాంశంతో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో కేవలం అప్పుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు మాత్రమే కాదు... డబ్బులు లేకపోతే బంధు మిత్రుల నుంచి ఎదురయ్యే అవమానాల నుంచి క్రెడిట్ కార్డులు, ఈఎంఐల వరకు పలు అంశాలు స్పృశించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే... ఒక ప్రణాళిక లేకుండా చేసే అప్పులు ఎటువంటి అనర్థాలకు దారి తీస్తాయనేది సినిమాలో చక్కగా చెప్పారు. 

'కార్మేని సెల్వం'లో చెప్పిన పాయింట్ బావుంది. ఓ సన్నివేశంలో అపార్ట్‌మెంట్లలో జీవించే వాళ్ళందరూ ధనవంతులు కాదని, వాళ్ళకు అప్పులు ఉన్నాయని చెప్పే సన్నివేశం బావుంది. అటువంటి కుటుంబాల్లో సంపాదించే భర్తకు ఏమైనా అయితే కుటుంబం పరిస్థితి ఏమిటి? అని సూటిగా ప్రశ్న సంధించారు దర్శకుడు రామ్ చక్రి. అదే సన్నివేశంలో అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలియని కార్ డ్రైవర్ కుటుంబాన్ని చూపించారు. సంపాదనను జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి తప్ప... లేనిపోని హంగులు, ఆడంబరాలకు పోయి అప్పులు చేసి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చక్కటి సందేశం ఇచ్చారు. 

రామ్ చక్రి కథ, రచనలో మధ్య తరగతి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు పలు సినిమాల్లో చూసినప్పటికీ... పాత్రలతో ప్రయాణం చేసేలా దర్శకత్వం సాగింది. క్లుప్తంగా చెప్పాల్సిన సన్నివేశాలను కాస్త సాగదీశారు. దాంతో నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో లెంత్ ఎక్కువైనా బావున్నాయి. కానీ, భార్య భర్తల మధ్య సన్నివేశాలు కొన్నిటిని సాగదీశారు. దుబాయ్ ట్రాక్ మొత్తం రొటీన్. ఇంతకు ముందు అటువంటి సీన్స్ చూశాం. దాంతో మధ్య మధ్యలో బోర్ కొడుతుంది. కథకు తగ్గట్టు సంగీత దర్శకుడు రామానుజన్ పాటలు ఇచ్చారు. తమిళ్ డబ్బింగ్ అని తెలుస్తోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సోసోగా ఉంది. నిర్మాణ పరంగా కాస్త తక్కువలో తీసినట్టు తెలుస్తోంది. 

Also ReadDhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?

మధ్య తరగతి భర్తగా, క్యాబ్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని సహజంగా నటించారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్స్‌లో సముద్రఖని నటన... గతంలో ఆయన చేసిన 'విమానం'లో ఆయన నటనను గుర్తు చేస్తుంది. సముద్రఖని భార్యగా లక్ష్మీ ప్రియా నటన సైతం సహజంగా ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ పాత్రల పరిధి తక్కువ. ఉన్నంతలో న్యాయం చేశారు. మిగతా పాత్రధారుల్లో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండేవి తక్కువ.

'కార్మేని సెల్వం'లో సముద్రఖని పాత్ర పేరు సెల్వం. అతనొక కార్ డ్రైవర్ కనుక 'కార్ మేని సెల్వం' అని తమిళ నేటివిటీకి తగ్గట్టు టైటిల్ పెట్టారు. తెలుగులో కాస్త ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు మారిస్తే బావుండేది. తెలుగు వరకు టైటిల్ మైనస్ అని చెప్పాలి. సినిమా విషయానికి వస్తే... యువత కంటే కుటుంబ బాధ్యతలు మోస్తున్న మధ్య తరగతి భర్తలకు, కుటుంబాలకు కనెక్ట్ అయ్యే చిత్రమిది. అప్పులు చేసే వాళ్ళను ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి హెచ్చరించే సినిమా. అందరికీ నచ్చడం కష్టం. ఎమోషనల్ ఫిలిమ్స్ చూసే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే మంచిది.

Also Read: Youth Telugu Review - 'యూత్' రివ్యూ: ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ... కెన్ కామెడీ సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bad Boy Karthik: పాపం నాగశౌర్య... వెరీ బ్యాడ్ ప్లానింగ్, దారుణమైన రిలీజ్!
పాపం నాగశౌర్య... వెరీ బ్యాడ్ ప్లానింగ్, దారుణమైన రిలీజ్!
Lenin Yetta Yetta Song : 'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్
'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్
kalavari kodalu kanaka mahalakshmi serial today April 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బామ్మ మనవరాలు సిరిగా లక్ష్మీ కొత్త జీవితం! రోడ్డునపడ్డ విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బామ్మ మనవరాలు సిరిగా లక్ష్మీ కొత్త జీవితం! రోడ్డునపడ్డ విహారి!
Maa Inti Bangaaram Song :  మా ఇంటి బంగారం తస్సాదియ్యా... సాంగ్ అదిరిందయ్యా - చీరకట్టులో సమంత డ్యాన్స్ వైరల్
మా ఇంటి బంగారం తస్సాదియ్యా... సాంగ్ అదిరిందయ్యా - చీరకట్టులో సమంత డ్యాన్స్ వైరల్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyavedu MLA: 100 కోట్లిస్తే మా నాన్న రాజీనామా చేస్తారు - సత్యవేడు ఎమ్మెల్యే కుమారుడి ప్రకటన- ఈ ఆఫర్ ఎవరికంటే?
100 కోట్లిస్తే మా నాన్న రాజీనామా చేస్తారు - సత్యవేడు ఎమ్మెల్యే కుమారుడి ప్రకటన- ఈ ఆఫర్ ఎవరికంటే?
Reaction on Tejaswi Surya: తేజస్వీసూర్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైర్ - తెలంగాణను అవమానించారని ఆగ్రహం
తేజస్వీసూర్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైర్ - తెలంగాణను అవమానించారని ఆగ్రహం
Telangana News: తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
Delhi airport flights crash: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం - హైదరాబాద్‌ ఫ్లైట్‌ను ఢీకొట్టిన మరో విమానం - అందరూ సేఫ్!
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం - హైదరాబాద్‌ ఫ్లైట్‌ను ఢీకొట్టిన మరో విమానం - అందరూ సేఫ్!
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Lenin Yetta Yetta Song : 'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్
'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్
Bajaj Dominar 400 Vs Triumph Speed 400 : బజాజ్ డోమినార్ Vs ట్రయంఫ్ స్పీడ్ 400 -బజాజ్ అందిస్తున్న రెండు పవర్‌ఫుల్ ఆప్షన్ల మధ్య బిగ్ ఫైట్!
బజాజ్ డోమినార్ Vs ట్రయంఫ్ స్పీడ్ 400 -బజాజ్ అందిస్తున్న రెండు పవర్‌ఫుల్ ఆప్షన్ల మధ్య బిగ్ ఫైట్!
India: ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
Embed widget