Apsara Rani New Movie : 'తలకోన'లో అప్సర - స్పెషల్ సాంగ్ కాదు, క్రైమ్ థ్రిల్లర్
అప్సరా రాణి అంటే ఐటెం భామ అని ముద్ర పడింది. అయితే, ఆమె ఇంతకు ముందు కథానాయికగా సినిమాలు చేశారు. మళ్ళీ హీరోయిన్‌గా సినిమా స్టార్ట్ చేశారు.
తెలుగులో అప్సరా రాణి (Apsara Rani) కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే... ఆవిడ చేసిన 'ఫోర్ లెటర్స్', 'ఊల్లాల ఊల్లాల' ఆశించిన విజయాలు సాధించలేదు. అయితే... అప్సర గ్లామర్ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్సులు తెచ్చింది. కొంత గ్యాప్ తర్వాత అప్సరా రాణికి మళ్ళీ హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.
Apsara Rani New Movie : అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'తలకోన (Talakona Movie). ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నగేష్ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా... 'గుర్తుందా శీతాకాలం' నిర్మాత రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
నేను కథకు ఫ్యాన్! - అప్సరా రాణి
''మంచి కథలు (స్క్రిప్ట్స్) కు నేను ఫ్యాన్. కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు నాకు మంచి తీసుకు వస్తుందని ఆశిస్తున్నా'' అని అప్సరా రాణి అన్నారు. ఈ సినిమా కంటే ముందు సుధీర్ బాబు 'హంట్'లో స్పెషల్ సాంగ్ 'పాపతో పైలం'తో ఆవిడ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తలకోన... క్రైమ్ థ్రిల్లర్!
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో సాగే సినిమా 'తలకోన' అని దర్శకుడు నగేష్ నారదాసి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''అటవీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. అడవి అంటే అందమైన ప్రకృతి మాత్రమే కాదు... మరో కోణం కూడా ఉంటుందని చూపిస్తున్నాం. రాజకీయాలు, మీడియా ప్రస్తావన కూడా ఉంటుంది. అసలు కథకు వస్తే... తలకోన అడవిలోకి వెళ్లిన స్నేహితుల బృందంలో ఎంత మంది ఉన్నారు? ఎంత మంది తిరిగి వచ్చారు? అనేది మెయిన్ పాయింట్. ఫ్యామిలీ అంతా చూసేలా ఉంటుంది. తలకొనలో 20 రోజులు, ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో మరో 20 రోజులు షూటింగ్ చేస్తాం'' అని చెప్పారు.
నిర్మాతగా తనకిది తొలి చిత్రమని డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'మాసూద' చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు బాసింశెట్టి వీరబాబు, జాన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడు.
Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
అప్సరా రాణికి సినిమాల కంటే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన 'డేంజరస్' సినిమా, ఫోటో షూట్స్, స్పెషల్ సాంగ్స్ పేరు తీసుకొచ్చారు. గత ఏడాది మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' సినిమాలో 'భూమ్ బద్దలు...' సాంగ్ చేశారు. ఆ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్ 'సీటీమార్' సినిమాలో 'పెప్సీ ఆంటీ...'లో సందడి చేశారు.