Butterfly Teaser: ‘బటర్ ఫ్లై’ టీజర్ - రెక్కల చప్పుళ్లే, మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ - టెన్షన్ టెన్షన్‌గా అనుపమా!
అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘బటర్ ఫ్లై’ చిత్రం టీజర్ విడులైంది. ఎలా ఉందో చూసేయండి మరి.

అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న ‘బటర్ ఫ్లై’ (Butterfly) మూవీ టీజర్ గురువారం విడుదలైంది. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో అనుపమా ప్రధాన పాత్ర పోషిస్తోంది. భూమిక మరో కీలక పాత్రలో కనిపించనుంది.
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇందులో అనుపమా మాత్రమే కనిపిస్తుంది. మొదట్లో హ్యాపీగా కనిపించే అనుపమా ఆ తర్వాత టెన్షన్ టెన్షన్‌గా కనిపిస్తుంది. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆమె ఎందుకు టెన్షన్ పడుతోందనేది వెండితెరపైనే చూడాలి. ఇందులో అనుపమ నటన తప్పకుండా నచ్చేస్తోంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు అర్విజ్, గిడియన్ కట్టా సంగీతం మరింత ప్లస్ అయ్యింది. ‘బటర్ ఫ్లై’ టీజరైతే బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందనేది త్వరలోనే తేలిపోతుంది. అయితే, ఈ టీజర్‌లో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు.
View this post on Instagram
ఇటీవల అనుపమా.. అకస్మాత్తుగా రూటు మార్చింది. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో ఒక్కసారిగా కిస్సింగ్ క్వీన్ అయిపోయింది. కరోనా వచ్చినా హుషారుగా కాలర్ ఎగరేసుకుని తిరిగేసిన కుర్రాళ్లు.. ఆ సీన్స్ చూసి ఒక్కసారే మంచాన్న పడ్డారు. చాలామంది గుండె పగిలిందని హెల్త్ రిపోర్ట్స్ అందాయి. మరి అనుపమా అదే రూటులో కొనసాగుతుందా? లేదా మళ్లీ పాత రూటులోకే వచ్చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’, ‘18 పేజేస్’, ‘బటర్‌ఫ్లై’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

