(Source: ECI/ABP News/ABP Majha)
Anupam Kher : ‘పుష్ప’తో పోల్చితే ‘కశ్మీర్ ఫైల్స్’ బెస్ట్, మరోసారి సంచనల వ్యాఖ్యలు చేసిన అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి తాను జాతీయ చలన చిత్ర అవార్డుకు అర్హుడినని చెప్పుకొచ్చారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘కశ్మీర్ ఫైల్స్’ అద్భుతమైన సినిమా అన్నారు.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. ‘పుష్ప’ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంపై తన అక్కసు వెళ్లగక్కారు. ఈ సినిమాతో పోల్చితే వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన `ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో తన నటన చాలా నేచురల్ గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో కాశ్మీరీ పండిట్ పాత్రకు తన శక్తి మేరకు న్యాయం చేశానని చెప్పారు. తాజాగా పుణెలో జరిగిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన సాహిత్య ఉత్సవం అభివ్యక్తి సన్మాన్ లో ఆయన పాల్గొన్నారు. తనను ఎవరు పిలిచినా, పిలవకపోయినా, జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తానని చెప్పారు.
‘పుష్ప’పై మరోసారి అక్కసు వెల్లగక్కిన అనుపమ్ ఖేర్
ఈ వేడుకలో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో తన పాత్ర గురించి అనుపమ్ ఖేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమాలోని ప్తరి భావోద్వేగాన్ని నేచురల్ గా చేశాను. కొన్ని పాత్రలకు ఆస్థాయిలో నేచురాలిటీ ఉండదు. ఈ చిత్రంలో నా పాత్రకు ఎమోషన్స్ జోడించిన రక్తికట్టేలా చేశాను. ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో పుష్కర్ నాథ్ తీర్చి దిద్దిన విధానం చాలా బాగుంటుంది. ఇందులో ఎలాంటి క్రాఫ్ట్ ప్రమేయం లేదు. చాలా సహజంగా ఉంటుంది” అని చెప్పారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో అద్భుతంగా నటించిన తనకు జాతీయ అవార్డు అందుకునే అర్హత ఉందని అనుపమ్ మరోసారి తేల్చి చెప్పారు. ’నేను థియేటర్‌లో ‘పుష్ప‘ సినిమాను చూశాను. అప్పుడు తనను అభినందించాను. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ కూడా పెట్టాను. కానీ, ఈ చిత్రంలో ఆయన నటనతో పోల్చితే, ‘కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో తన నటనకే జాతీయ అవార్డు పొందే అర్హతలున్నాయి” చెప్పుకొచ్చారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. `ది కాశ్మీర్ ఫైల్స్` నటి పల్లవి జోషి ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఈ సినిమాకు దక్కింది. కానీ, అనుపమ్ ఖేర్ కు ఎలాంటి అవార్డు రాలేదు.
రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్తా- అనుపమ్ ఖేర్
మరోవైపు జనవరి 22న జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి తాను కచ్చితంగా వెళ్తానని అనుపమ్ ఖేర్ వెల్లడించారు. “భారతీయులందరూ ఈ చారిత్రాత్మకమైన రోజు కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ గొప్ప రోజు కోసం హిందువులు చాలా ఏళ్లు న్యాయబద్దంగా పోరాడారు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, ప్రజల ఎమోషన్స్ తో ముడిపడి ఉన్న అంశం. రామాలయ ప్రారంభం రోజు ఎవరు తనను ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా, నేను కచ్చితంగా వెళ్తాను. అక్కడి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటాను” అని చెప్పారు.
Read Also: చిరంజీవి సచిన్, పవన్ కల్యాణ్ విరాట్ కోహ్లీ, భలే చెప్పావయ్యా వరుణ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial