News
News
X

Anu Emmanuel: మెగాహీరోతో ప్రేమాయణం - అను ఇమ్మాన్యుయేల్ ఏమందంటే?

అల్లు శిరీష్ తో లవ్ ఎఫైర్ పై అను ఇమ్మాన్యుయేల్ స్పందించింది.

FOLLOW US: 
 
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel). అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు అల్లు శిరీష్ తో కలిసి 'ఊర్వశివో రాక్షసివో'(Urvasivo Rakshasivo) అనే సినిమాలో నటించింది. రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అను ఇమ్మాన్యుయేల్. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా అను.. శిరీష్ తో ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నాయి. 

Anu Emmanuel responds to link-up rumors with Sirish:'ఊర్వశివో రాక్షసివో' సినిమాలో ఘాటు రొమాంటిక్ సీన్స్ ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఇప్పటివరకు అను ఇమ్మాన్యుయేల్ నోరు విప్పలేదు. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె తన లవ్ లైఫ్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం తను ఎవరినీ డేటింగ్ చేయడం లేదని.. అలానే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చింది. 

పరోక్షంగా అల్లు శిరీష్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని వెల్లడించింది. మొన్నామధ్య శిరీష్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. ఓ కొత్త సినిమా వస్తున్నప్పుడు ఇలాంటి వార్తలు సహజమేనని అన్నారు. నిజంగా తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని తేల్చిచెప్పేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్ని కొట్టిపారేశారు ఈ యువహీరో. తామిద్దరం మంచి స్నేహితులమని అన్నారు. అయితే అను ఇమ్మాన్యుయేల్‌ కు తనకూ అభిరుచులు కొంతమేర కలిశాయని అవే తమని మంచి ఫ్రెండ్స్ గా మార్చాయని చెప్పారు. వాస్తవంగా నెలల పాటు ఓ సినిమా తీస్తున్నామంటే అందులో పనిచేసే వారి మధ్యలో మంచి స్నేహాభావం ఏర్పడుతుందని, అది సహజమని అన్నారు. అలాగే వారిద్దరికీ స్నేహం కుదిరిందని చెప్పుకొచ్చారు.

గతంలోనూ తనపై ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయన్నారు. ప్రతీ సినిమాకు ఏదొక గాసిప్ బయటకు వస్తూనే ఉంటుందని, అందుకే తాము చాలా వరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని అన్నారు. వర్క్ విషయంలో అను ఇమ్మాన్యుయల్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అందుకే సినిమాలో ముద్దు సీన్ లు కూడా ఇబ్బంది లేకుండా చేశామని అన్నారు. లేకపోతే ఆ సీన్స్ విషయంలో కొంత ఇబ్బంది అయ్యేదని చెప్పారు. 

News Reels

సినిమా విషయంలో ముందునుంచే డైరెక్టర్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని అన్నారు. హీరో క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీ అంశంపై తాము ముందే బిల్డ్ చేసి తర్వాతే సినిమా ప్రారంభించామని చెప్పారు శిరీష్. సినిమా చాలా బాగా వచ్చిందని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ యువతను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ప్రతీ ఒక్కరి జీవితాలకు దగ్గరగా ఉన్నట్టు ఈ సినిమాలో  క్యారెక్టర్ ఉంటుందన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా  వచ్చే నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నాళ్ళ నుంచో ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీష్‌కు ఈ సినిమా అయినా మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి.

Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్

Published at : 22 Oct 2022 08:22 PM (IST) Tags: Anu Emmanuel Allu sirish Urvasivo Rakshasivo

సంబంధిత కథనాలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam