News
News
X

Anjali Jhansi Web Series: డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అంజలి ఎంట్రీ, ‘ఝాన్సీ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

తెలుగు అమ్మాయి అంజలి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టబోతున్నది. ఈమె కీలక పాత్రలో నటిస్తున్న ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాబోతున్నది. ఇప్పటికే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

FOLLOW US: 

అందాల ముద్దుగుమ్మ  అంజలి తెలుగు అమ్మాయి అయినా, తమిళ సినిమా పరిశ్రమలోనే సత్తా చాటింది. తెలుగులో అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నా.. కోలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెడుతోంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈ నెల 20న విడుదల కాబోతున్నట్లు తొలుత ప్రకటించినా, కొన్ని కారణాలతో ఈ నెల 27కు మార్చారు. ఈ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.    

డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరిస్‌లకు కూడా బాగానే ప్రజాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ లు చేసేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు మొగ్గు చూపుతున్నారు. ఇదే బాటలో నడుస్తున్న తెలుగమ్మాయి అంజలి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఏకంగా మూడు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అందులో ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ విడుదలకు రెడీ అయ్యింది.  ఈ నెల 27 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. పూర్తిగా యాక్షన్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నది. తన ఎనిమీస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఓ మహిళా పోలీస్ అధికారి ఎదుర్కొనే ఇబ్బందుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ లో అంజ‌లితో పాటు చాందిని చౌద‌రి మరో కీ రోల్ పోషిస్తోంది. అటు శ్రీ చ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.

మరో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్న అంజలి

ఇక అంజలి మిగతా వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే ’ బ‌హిష్క‌ర‌ణ‌’, ‘ఫాల్’ లో నటిస్తోంది. మరోవైపు  రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా,  శంక‌ర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది సినిమాలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌ చేసింది . తన ఒంపు సొంపులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలోనూ కీలక పాత్ర చేసి మెప్పించింది. ఇక అంజలి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ హీరోగా ‘చాణక్య’ అనే సినిమాను తెరకెక్కించారు తిరు. ఆయన తొలిసారిగా ఈ వెబ్ సిరీస్ నే డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు యాక్టర్ కృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Read Also: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!

Published at : 13 Oct 2022 02:01 PM (IST) Tags: Anjali Jhansi Web Series DISNEY+ HOTSTAR Jhansi Release Date

సంబంధిత కథనాలు

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'