Aadi Saikumar: ఆది సాయి కుమార్, జేడీ సినిమాకు యానిమల్ సంగీత దర్శకుడు
Rudhiraksha Movie: 'యానిమల్'తో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ నేషనల్ లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. లేటెస్టుగా ఆది సాయి కుమార్ సినిమాకు ఆయన సంతకం చేశారు.

Animal music director signs Aadi Saikumar latest movie Rudhiraksha సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', దుల్కర్ సల్మాన్ 'కనులు కనులు దోచాయంటే' వంటి హిట్ సినిమాలు చేశారు. అయితే... 'యానిమల్'తో నేషనల్ & ఇంటర్నేషనల్ లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. 'యానిమల్' సినిమాలో నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రేక్షకులు పోస్టులు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 'యానిమల్' విడుదలైన తర్వాత తెలుగు సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంతకం చేశారు.
ఆది సాయి కుమార్ హీరోగా...
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో!
Rudhiraksha Movie: యంగ్ & డైనమిక్ స్టార్ ఆది సాయి కుమార్ కథానాయకుడిగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా 'రుధిరాక్ష'. ఇందులో విలక్షణ నటుడు, 'దయా' వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో మంచి విజయం అందుకున్న జేడీ చక్రవర్తి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్యరాజ్ ప్రధాన పాత్రధారులు. 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.
'రుధిరాక్ష' చిత్రానికి శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు జువ్వల నిర్మాత. డార్క్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొండుతోన్న ఈ సినిమా రామానాయడు స్టూడియోలో పూజతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
'రుధిరాక్ష' సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్ తాళ్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.... ప్రముఖ నటుడు సముద్రఖని క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి చిత్ర దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించారు.
'రుధిరాక్ష'కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం!
ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో 'రుధిరాక్ష' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని రాజు జువ్వల చెప్పారు. 'యానిమల్' ఫేమ్ హర్షవర్షన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని ఆయన వివరించారు. ఇంతకు ముందు ఆది సాయి కుమార్ 'టాప్ గేర్' సినిమాకు కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆదితో ఆయనకు రెండో చిత్రమిది.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
ఆది సాయి కుమార్, జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి కళా దర్శకత్వం: విజయ్ కృష్ణ, మాటలు: పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర, ఛాయాగ్రహణం: కిశోర్ బోయిదాపు, సంగీతం: హర్షవర్షన్ రామేశ్వర్ (యానిమల్ ఫేమ్), నిర్మాణ సంస్థ: 9 స్టార్ ఎంటర్టైన్మెంట్, నిర్మాత: రాజు జువ్వల, రచన - దర్శకత్వం: శివ శంకర్ దేవ్.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















