By: ABP Desam | Updated at : 28 Dec 2021 07:14 PM (IST)
మలయాళ చిత్రం 'భీష్మ పర్వం'లో ఆలిస్ పాత్రలో అనసూయ
అనసూయ అంటే హాట్ ఇమేజ్ ఉంది. టీవీ కార్యక్రమాల్లో ఆమె వస్త్రధారణ హాట్ ఇమేజ్ తీసుకొచ్చింది. అయితే... ఆ ఇమేజ్ దాటి అనసూయ ఎప్పుడో బయటకు వచ్చారు. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'క్షణం'లో ఏసీపీ జయ భరద్వాజ్‌గా, 'థాంక్యూ బ్రదర్' సినిమాలో గర్భిణి ప్రియా పాత్రలో, 'యాత్ర'లో చరితా రెడ్డిగా డీ-గ్లామర్ రోల్స్ చేశారు. ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీకి కూడా డీ-గ్లామర్ రోల్‌తో పరిచయం అవుతున్నారు.
మలయాళ వెండితెరకు అనసూయ నటిగా పరిచయం అవుతున్న సినిమా 'భీష్మ పర్వం'. అందులో ఆలిస్ పాత్రలో నటించారు. నేడు సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అమల్ నీరడ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరో. ఆయనతో అనసూయకు రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వీళ్లిద్దరూ 'యాత్ర'లో నటించారు.
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
"తొలి రోజు నుంచి కొన్ని పాత్రలు మనపై ప్రభావం చూపిస్తాయి. ఆ తర్వాత తర్వాత జీవితాంతం గర్వించే పాత్రలుగా రూపాంతరం చెందుతాయి. అటువంటి పాత్ర ఇదే. మీట్ ఆలిస్" అని అనసూయ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇంత కంటే మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతానని కలలోనూ ఊహించలేనని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన హీరో మమ్ముట్టికి, దర్శకుడికి థాంక్స్ చెప్పారు అనసూయ.
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: సుడిగాలి సుధీర్ మీద 'గులాబి' హీరోయిన్ మహేశ్వరి పంచ్ డైలాగ్స్!
Also Read: టికెట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్!
Also Read: 'నువ్ లేకపోతే నేను లేను..' బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్ కొత్త మూవీ షురూ
Manchu Manoj: తారకరత్న పూర్తిగా కోలుకొని తిరిగి వస్తాడు: మంచు మనోజ్
Rajinikanth: దర్శకుడు గోపిచంద్ మలినేనికు రజనీకాంత్ ఫోన్, ఎందుకంటే?
Prabhas – Maruthi: ప్రభాస్ కారులో మారుతి షికారు, షూటింగ్ మధ్యలో దర్శకుడి సరదా!
Kavali MLA : మేం సత్యవంతులం కాదు - కానీ టీడీపీ హయాం కంటే తక్కువ అవినీతి చేస్తున్నామన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే !
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్
Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ