News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Shah Rukh Khan: ‘షారుక్ 57 సంవత్సరాల వ్యక్తిలా ఉన్నారా’ - ‘జిందా బందా’పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - కింగ్ ఖాన్ ఏమన్నాడంటే?

‘జిందా బందా’ పాటలో షారుక్ ఖాన్ ఎనర్జీని పొడుగుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ‘జవాన్’ నుంచి ‘జిందా బందా’ పేరిట పాట విడుదల అయింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ స్వరపరిచి, ఆలపించిన ఈ పాట ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా వైరల్ అయింది. మొదటి రోజే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

ఈ సాంగ్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. షారుక్ ‘జిందా బందా’ పాటలోని ఒక క్లిప్‌ను పోస్ట్ చేసి దానికి క్యాప్షన్‌గా ‘57 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిలా ఉన్నాడా? అతని ఏజింగ్ ప్రాసెస్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతం భూమిపై ఉన్న చాలా మంది కంటే 10 రెట్లు ఎక్కువ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు” అంటూ రాశారు. ఈ పోస్టు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైర‌ల్ అయింది. 

దీనిపై షారుఖ్ ఖాన్ కూడా స్పందించాడు. ‘ఆనంద్ మహీంద్రా సర్... జీవితం చాలా చిన్న‌ది, తొందరగా గడిచిపోతుంది. దానితో పాటు పోటీ ప‌డటానికి ప్రయత్నించాలి. ఎంత మందిని వీలైతే అంతమందిని ఎంటర్‌టైన్ చేయాలి. దాని కోసం న‌వ్వాలి, ఏడవాలి, ఊగిపోవాలి, ఎగిరిపోవాలి. వీలయితే న‌క్షత్రాల‌తో క‌లిసి ఈత కొట్టేలా ఉండాలి. ఆనందపు క్షణాల గురించి కల‌లు కనాలి’ అని కింగ్ ఖాన్ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ పాట తెలుగులో ‘దుమ్ము దులిపేలా’ అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ పాట సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ స్వరపరచడంతో పాటు స్వయంగా పాడారు. చంద్రబోస్ చక్కటి సాహిత్యం అందించారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్‌పై ఈ పాటను చూస్తే నిజమేనేమో అని కూడా అనిపిస్తోంది. ఈ పాట కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు పని చేసినట్లు సమాచారం. ఈ పాట ఓ విజువల్ వండర్ గా రూపొందింది.

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు జోడీగా కోలీవుడ్ బ్యూటీ నయనతార నటిస్తున్నారు. విజయ్ సేతుపతి  విలన్‌గా కనిపించనున్నారు.  ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  ‘జవాన్’ తెరకెక్కింది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7వ తేదీన విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో 'పఠాన్‌'తో ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టాడు. భారతదేశంలో రూ. 525 కోట్ల నెట్‌తో షారుఖ్.. భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘బాహుబలి 2’ విడుదల అయిన ఆరేళ్లకు దాని రికార్డును షారుక్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

Published at : 02 Aug 2023 07:31 PM (IST) Tags: Anand Mahindra Shah Rukh Khan Jawan Zinda Banda

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

టాప్ స్టోరీస్

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు