Amaran Movie: అమర జవాన్ భార్యగా సాయి పల్లవి - ఆకట్టుకుంటున్న ‘అమరన్’ బ్యూటీఫుల్ ఇంట్రో!
Sai Pallavi's Intro: శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బ్యూటీఫుల్ ఇంట్రో రిలీజ్ చేశారు.
Sai Pallavi's Intro In Amaran: కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, బ్యూటీ ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సాయి పల్లవి ఇంట్రోను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆమెను అమర జవాన్ సతీమణిగా చూపించారు.
ఇందు రెబాక వర్గీస్ గా సాయి పల్లవి
ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తరచుగా అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, తాజాగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్రోను వదిలారు. ఈ సినిమాలో ఆమె ఇందు రెబాక వర్గీస్ అనే పాత్ర పోషిస్తోంది. కొన్ని రియల్ విజువల్స్ తో కలిపి సాయి పల్లవి పాత్రలను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. శివ కార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నది. మ్యూజిక్ వినసొంపుగా అలరిస్తోంది. ‘అమరన్’ ఇంట్రో ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ తో పాటు అటు శివకార్తికేయన్ ఫ్యాక్స్ కు బ్యూటీఫుల్ ట్రీట్ ను అందించింది.
దివంగత ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ కథాశంతో తెరకెక్కుతున్న ‘అమరన్’
‘అమరన్’ సినిమాను దివంగత ఆర్మీ అధికారి ముకుంద్ కథాశంతో తెరకెక్కిస్తున్నారు. ఆయన భార్య సింధు పాత్రలో ఇందుగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా ఇంట్రోలో ముకుంద్, సింధు భావోద్వేగ ప్రయాణానికి సంబంధించిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఢిల్లీ రాజ్ పత్ ముందుకు రిపబ్లిక్ డే పరేడ్ తో ఈ ఇంట్రో ప్రారంభం అవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టేజి మీద ఉండగా, ముకుంద్ భార్య సింధును సత్కరిస్తున్న విజువల్స్ తో సాయి పల్లవిని చూపించారు. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ ముకుంద్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఇంట్రో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ బుక్ ఆధారంగా..
‘అమరన్’ సినిమాను శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్’ అనే పుస్తకం ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా రాజీవ్, సినిమాటోగ్రాఫర్ గా సిహెచ్ సాయి, ఎడిటర్ గా ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్లుగా అన్బరివ్ మాస్టర్స్, స్టీఫన్ రిక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతడి సోదరి నిఖితరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా విడుదల చేయనున్నారు.
Read Also: దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?