సాయి పల్లవి.. మనసును హత్తుకొనే వీడియో, అక్కంటే ఇలా ఉండాలి.

సాయిపల్లవి అంటే ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు అభిమానం.

ఆమె డ్యాన్స్, అభినయమే కాదు.. ఆమె వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

అందుకే, ఆమెపై ఎవరూ ఈగ వాలనివ్వరు. ఎవరైనా ట్రోల్ చేస్తే ఫ్యాన్స్ ఇచ్చిపడేస్తారు.

ఇటీవలే ఆమె చెల్లి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వేడుకలో అన్నీ తానై వ్యవహరించింది.

ఎంతో సింపుల్‌గా.. నిరాడంబరంగా పూజా కన్నాన్ నిశ్చితార్థం జరిగింది.

అందుకే, తాను లేకపోతే నా జీవితమే లేదంటూ పూజా ఎమోషనల్ అయ్యింది.

ఈ సందర్భంగా తన అక్క వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. తన ప్రేమను వ్యక్తం చేసింది.

ఈ వీడియో చూసిన ఎవరికైనా.. సాయి పల్లవిపై అభిమానం పెరిగిపోద్ది.

ఇలాంటి అక్క ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.

Images and Videos Credit: Pooja Kannan/Instagram