సీనియర్ హీరోయిన్ మీనా మళ్లీ మెల్లగా స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చేస్తోంది. సినిమాలతో మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ షోలతో కూడా అలరిస్తోంది. ముఖ్యంగా డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ అయిపోతోంది. డ్యాన్స్, కామెడీ షోలతో జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు చాలామంది సీనియర్ హీరోలతో కలిసి స్టెప్పులేసింది మీనా. తాజాగా పింక్ కలర్ డ్రెస్‌లో ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పింక్ డ్రెస్ చూడడానికి సింపుల్‌గా ఉన్నా చాలా ట్రెండీగా అనిపిస్తోంది. జీవితాన్ని డ్యాన్స్‌తో ఆహ్వానిస్తూ ఫోటోలు దిగుతున్నానని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టింది. డ్యాన్స్ అండ్ క్లిక్ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జతచేసింది. Images Credit: Meena Sagar/Instagram