News
News
X

Pushpa Songs: యూట్యూబ్‌లోనూ ‘తగ్గేదేలే’ అంటున్న‘పుష్ప’ - 2022లో ‘పుష్ప’ పాటలే టాప్!

‘పుష్ప’ పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన పాటగా ‘శ్రీవల్లి’ నిలిచింది. ‘సామి సామి’, ‘ఊ అంటావా మావా’ అనే పాటలు కూడా టాప్ ప్లేస్ దక్కించుకున్నాయి.

FOLLOW US: 
Share:

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల అద్భుత విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో చేరింది. ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.  

రష్యాలో ‘పుష్ప’ సందడి!

ఇండియాలో సత్తా చాటిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఇటీవల రష్యాలో విడుదలైంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్, రష్మిక మందన్న, సుకుమార్ సహా సినిమా యూనిట్ ఈ మధ్యే మాస్కోలో పర్యటించింది. ఈ చిత్రం డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ లో విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. డిసెంబర్ 8న రష్యాలోని పలు నగరాల్లో విడుదల కానుంది. అటు 24 రష్యన్ నగరాల్లో జరగనున్న 5వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకల్లోనూ ఈ సినిమాను ప్రదర్శిస్తారు. మొత్తంగా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో ‘పుష్ప- ది రూల్’ త్వరలో షూటింగ్ మొదలు కానుంది. రష్యా ప్రమోషన్స్ ముగించుకుని రాగానే సినిమా చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది.  

యూట్యూబ్ లో సత్తా చాటిన ‘పుష్ప’

ఇక థియేటర్లలో సత్తా చాటిన ‘పుష్ప’ సినిమా యూట్యూబ్ లోనూ సత్తా చాటింది. ఈ సినిమా పాటలు ఓ రేంజిలో ప్రజాదరణ పొందాయి. చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది. 2022కు గాను అత్యధిక వ్యూస్ అందుకున్న పాటల లిస్టును యూట్యూబ్ విడుదల చేసింది. ఇందులో ‘పుష్ప’ పాటలు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఈ సినిమాలోని పాటలు ‘శ్రీవల్లి’, ‘సామీ సామీ’, ‘ఊ అంటావా మావా’ టాప్ ర్యాంకును దక్కించుకున్నాయి.  పూజా హెగ్డే,  విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు - హలమితి హబీబో’ పాట కూడా టాప్ లో నిలిచింది. జనవరి 1 నుంచి అక్టోబర్ 30 వరకు సేకరించిన డేటా ప్రకారం ఈ లిస్టును విడుదల చేసింది.

యూట్యూబ్‌లో 2022  టాప్ 10 సాంగ్స్ ఇవే..

1. శ్రీవల్లి - పుష్ప

2. అరబిక్ కుతు – హలమితి హబీబో – బీస్ట్ (లిరిక్ వీడియో)

3. సామి సామి – పుష్ప (హిందీ వెర్షన్)

4. కచా బాదం పాట - భుబన్ బద్యాకర్

5. LE LE AAYI కోకా కోలా – KHESARI LAL YADAV

6. ఊ బోలెగా యా ఓ ఓ ఓ బోలేగా – పుష్ప

7. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా – పుష్ప

8. పసూరి - అలీ సేథి X షే గిల్

9. అరబిక్ కుతు – హలమితి హబీబో – బీస్ట్ (మ్యూజిక్ వీడియో)

10. నాతునియా - ఖేసరి లాల్ యాదవ్

Published at : 07 Dec 2022 11:53 AM (IST) Tags: Allu Arjun YouTube Saami Saami Pushpa songs Srivalli Oo Antava Mawa

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 1st: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్

Ennenno Janmalabandham February 1st: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని