News
News
X

Allu Arjun: అల్లు స్టూడియోస్ లాంచ్ చేసిన చిరు - అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్!

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.   

FOLLOW US: 

దివంగత అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహించారు. ఆయన గుర్తుగా అల్లు ఫ్యామిలీ ఓ స్టూడియోను నిర్మించింది. అదే అల్లు స్టూడియోస్. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ స్టూడియోస్ ను ఆరంభించినందుకు చిరంజీవికి స్పెషల్ థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో చిరు, బన్నీ తమ స్పీచ్ లతో ఆకట్టుకున్నారు. నాడు నటుడిగా ఎదగాలనే అల్లు రామలింగయ్య గారి ఆలోచన నేడు ఓ వ్యవస్థగా మారిందని చిరు అన్నారు. అల్లు వారు తరతరాలు ఆయన్ను తలచుకుంటూనే ఉండాలని చెప్పారు. 

అల్లు అరవింద్ ను నిర్మాత చేయాలని రామలింగయ్య గారు గీతాఆర్ట్స్ సంస్థను స్థాపించి ఓ మార్గం చూపించారని అన్నారు. అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం ఏర్పాటు చేయలేదని అనుకుంటున్నానని.. అల్లు రామలింగయ్యను తలుచుకునేందుకు ఈ స్టూడియోను నిర్మించారని భావిస్తున్నట్లు చెప్పారు. చిరస్థాయిలో ఆయన పేరు నిలబడేలా కృషి చేసిన అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, బాబీలను అభినందించారు చిరంజీవి. 

ఇదే ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'అల్లు అరవింద్ గారికి ప్రొడక్షన్ హౌస్ ఉంది. చాలా ల్యాండ్ ఉంటుంది. స్టూడియోస్ పెట్టడం విషయం ఏం కాదని మీరు అనుకోవచ్చు. కానీ మాకేదో ఈ స్టూడియో కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని పెట్టలేదు. ఈ స్టూడియో పెట్టాలనేది మా తాతయ్య గారి కోరిక' అని చెప్పారు అల్లు అర్జున్. మనందరికీ ఓ స్టూడియో ఉంటే బాగుండేదని ఆయన అంటుండేవారని.. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించినట్లు చెప్పారు. 

News Reels

ఇక స్టూడియోస్ విషయానికొస్తే.. గండిపేట్‌లో 10 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. అన్ని సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 

ఇక ఈ స్టూడియోస్ లో ముందుగా 'పుష్ప2' షూటింగ్ ను జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా కొన్ని సెట్స్ ను నిర్మించనున్నారు. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరి ఈసారి మారేడుమిల్లి వెళ్తారో లేక ఇతర అడవి లొకేషన్స్ ఏమైనా చూస్తారో తెలియాల్సివుంది. విదేశాల్లో కూడా అటవీ లొకేషన్స్ చూస్తున్నారని టాక్. ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారో చూడాలి! 

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Published at : 01 Oct 2022 05:51 PM (IST) Tags: Allu Arjun Megastar Chiranjeevi Allu Ramalingaiah Allu Studios

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్