Allu Arjun: ‘క్లీన్ స్వీప్’ చేసేశాం: అల్లు అర్జున్
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలో ‘పుష్ప’ సినిమా సత్తా చాటింది. బెస్ట్ సినిమా, బెస్ట్ హీరో, బెస్ట్ డైరెక్టర్ సహా 7 విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. తెలుగులో తనకు పోటీ లేదని నిరూపించుకుంది.
ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో(అక్టోబర్ 9న) అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలో అత్యత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, టెక్నీషియన్స్, ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందజేశారు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప- ది రైజ్’మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఏడు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది.
ఏ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయంటే?
❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్)- అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
❂ ఉత్తమ చిత్రం - పుష్ప: ది రైజ్- పార్ట్ 1
❂ ఉత్తమ దర్శకుడు - సుకుమార్ బంద్రెడ్డి (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
❂ ఉత్తమ సంగీత – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - సిద్ శ్రీరామ్ - శ్రీవల్లి (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) - ఇంద్రావతి చౌహాన్ - ఊ అంటవా (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
❂ ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
హీరో అల్లు అర్జున్ సంతోషం
‘పుష్ప’ సినిమా ఏడు కేటగిరీల్లో అవార్డులు అందుకోవడం పట్ల హీరో అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పుష్ప క్లీన్ స్వీప్ చేసిందని వెల్లడించారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫిమేల్ సింగర్ తో పాటు బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ లలో అవార్డులు అందుకున్నట్లు వెల్లడించారు. అందరికీ థ్యాంక్స్ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ‘పుష్ప’ సినిమా ఇన్ని అవార్డులు అందుకోవడం పట్ల అల్లు ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు.
#PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽
— Allu Arjun (@alluarjun) October 10, 2022
ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లు వసూలు
ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను నిర్మించాయి. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 360 కోట్లు వసూలు చేసింది. అటు ‘పుష్ప పార్ట్-2’ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో సీక్వెల్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?
Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్