అన్వేషించండి

ప్రభాస్ 'ఆదిపురుష్'తో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ప్రారంభం

'ఫుష్ప' సినిమాతో ఎనలేని పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఓ మల్టిఫ్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు. ప్రభాస్ 'ఆది పురుష్' మూవీతో ఈ థియేటర్ గ్రాండ్ గా లాంచ్ కానున్నట్టు సమాచారం

Allu Arjun : టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు అగ్ర తారలుగా వెలుగొందుతూనే  ఇతర రంగాల్లోకి అడుగుపెట్టి తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. ఇప్పటికే శర్వానంద్, సందీప్ కిషన్ వంటి హీరోలు కాఫీ షాపులు, హోటళ్లను నెలకొల్పి ఆదాయాలను అర్జిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి వార్తల్లో నిలిచారు. గతంలోనూ ఒక విమానయాన సంస్థను కలిగి ఉన్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌ను కలిగి ఉండగా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ‘AMB’ మాల్‌ని నడుపుతున్నాడు. విజయ్ దేవరకొండ మహబూబ్‌నగర్‌లో AVD అనే మల్టీప్లెక్స్‌ను కూడా నిర్మించాడు. ఇప్పుడు అదే తరహాలో అల్లు అర్జున్ ఓ కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నాడు. అది కూడా ఓ పాన్ ఇండియా హీరో సినిమాతో. 

ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగస్థలం వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. అమీర్‌పేట ప్రధాన జంక్షన్‌లో నిర్మిస్తోన్న మల్టీప్లెక్స్‌కు  అల్లు అర్జున్ పార్ట్ నర్ ఉన్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్‌ని కొనుగోలు చేసి, దాని స్థానంలో ఈ థియేటర్‌ను నిర్మించారు. ఈ థియేటర్ ప్రారంభోత్సవం త్వరలోనే జరగనుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త మల్టీప్లెక్స్‌ని అల్లు అర్జున్ జూన్ 16న రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం 'ఆదిపురుష్‌'తో ప్రారంభించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

మల్టీప్లెక్స్ ప్రవేశద్వారం వద్ద అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. లాంచ్ రోజున మల్టీప్లెక్స్ ఆవరణలో 100 కి పైగా LED స్క్రీన్‌లను ప్లే చేస్తారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఈ థియేటర్ ప్రారంభోత్సవానికి 2 వారాలే సమయం ఉంది. మల్టీప్లెక్స్‌కి AAA (ఆసియా అల్లు అర్జున్) సినిమాస్ అకా ఏషియన్ సత్యం అని పేరు పెట్టినట్టు సమాచారం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించే కొత్త ప్రయత్నం విజయవంతం కావాలని, AAA సినిమాస్ తెలుగు సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కుతోన్న సినిమా ‘పుష్ప 2’.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేయడంతో ఇప్పుడు రాబోయే పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలై అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడని సమాచారం. దాంతో పాటు ఓ హిందీ మూవీకి కూడా బన్నీ సైన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Read Also : Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget