News
News
వీడియోలు ఆటలు
X

Ugram OTT partner: ‘ఉగ్రం‘ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ OTT దిగ్గజం

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం సొంతం చేసుకుంది.

FOLLOW US: 
Share:

అల్లరి నరేష్ హీరోగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ఉగ్రం’.  మలయాళ బ్యూటీ మిర్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం,  ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందింది.  ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఇవాళ (మే 5న) ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచేశాయి.

‘ఉగ్రం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న అమెజాన్

అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాకు సంబంధించిన  డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రైట్స్ కోసం పలు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లు పోటీ పడినా, చివరకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. ఇందుకోసం ఫ్యాన్సీ అమౌంట్ అందజేసినట్లు సమాచారం. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అనే విషయంపైనా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘ఉగ్రం’ సినిమా కథేంటంటే?

తాజాగా విడుదలైన ట్రైలర్ లో ‘ఉగ్రం’ సినిమా కథేంటో చెప్పేశారు మేకర్స్. సిటీలో వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వీటి వెనుక కొంత మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉండటం, వారిని దందాను అంతమొందించేందుకు నిజాయితీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్  చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశంగా వెల్లడించారు. ఈ పోరాటంలో పోలీసు అధికారి ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి అనేవి సినిమాలో చూపించనున్నారు.

View this post on Instagram
 
A post shared by Allari Naresh (@allari_naresh)

‘నాంది’ తర్వాత ‘ఉగ్రం’

'నాంది' తర్వాత హీరో 'అల్లరి' నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా 'ఉగ్రం'. గతంలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న అల్లరి నరేష్, ‘నాంది’ సినిమాతో కొత్త ట్రాక్ లోకి అడుగు పెట్టారు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.  విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన 'నాంది'  సినిమా సూపర్ హిట్టయింది. మళ్లీ వీరిద్దరు కలిసి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు.  హీరోగా నరేష్ 60వ చిత్రమిది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో విజయ్-నరేష్ కాంబినేషన్‌లో మరో హిట్ పడటం ఖాయం అంటున్నరు అభిమానులు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో 'ఉగ్రం' చిత్రం రూపొందుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.  శత్రు, శరత్, ఇంద్రజ  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి  అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా టీజర్ విడుదలైంది. 

Read Also: షారుఖ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ‘జవాన్’ విడుదల వాయిదా, కారణం ఏంటంటే?

Published at : 05 May 2023 12:35 PM (IST) Tags: allari naresh Amazon Prime Video Ugram movie Ugram OTT partner

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!