News
News
వీడియోలు ఆటలు
X

Alia Bhatt: ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ఆలియా భట్, ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. తన సోదరికి రెండు ఫ్లాట్లను గిఫ్ట్ గా ఇచ్చింది. వీటి ధర కోట్ల రూపాయలలో ఉండటం విశేషం.

FOLLOW US: 
Share:

అందాల తార ఆలియా భట్ సినిమాల ద్వారా బాగా డబ్బు సంపాదిస్తోంది. సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆదాయాన్ని కూడబెడుతోంది. ఈ డబ్బుతో భారీగా స్థిరాస్తులు కూడబెడుతోంది. ప్రొడక్షన్ హౌస్ పేరిట తాజాగా ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది. బాంద్రాలో కొన్ని ఇండ్లను కొన్నది.     

ముంబైలో మూడు ఇండ్లు కొనుగోలు చేసిన ఆలియా

తన ప్రొడక్షన్ హౌస్ కోసం బాంద్రా వెస్ట్ లో 2,497 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అపార్ట్‌మెంట్ ను తీసుకుంది. దీని కోసం ఏకంగా అలియా రూ. 37.80 కోట్లు చెల్లించింది. అంతేకాదు, ఈ అపార్ట్ మెంట్ ను ఆమె ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. ఏరియల్ వ్యూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఈ భవంతి ఉన్నది. ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు కోసం ఏకంగా రూ. 2.26 కోట్ల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించించినట్లు తెలుస్తోంది. ఈ భవంతి కాకుండా ఆలియా భట్ ఏప్రిల్ 10న ముంబైలోని తన సోదరి షాహీన్ మహేష్ భట్‌కు రూ. 7.68 కోట్ల విలువైన రెండు అపార్ట్‌మెంట్లను కూడా బహుమతిగా ఇచ్చింది. ప్రైజ్ సర్టిఫికేట్ ద్వారా, అలియా తన సోదరికి రెండు ఫ్లాట్‌లను బహుమతిగా ఇచ్చింది. ఇది 2,086.75 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జిగి అపార్ట్‌మెంట్‌లలో ఉంది.   ఈ లావాదేవీకి సంబంధించి ఆమె రూ.30.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చింది.

ప్రస్తుతం బాంద్రాలో నివసిస్తున్న ఆలియా దంపతులు

ఆలియా ప్రస్తుతం భర్త రణబీర్ కపూర్‌తో కలిసి బాంద్రాలో నివసిస్తోంది. ప్రస్తుతం వీరు కృష్ణ రాజ్ బంగ్లా ప్రదేశంలో ఓ భవంతి నిర్మించబోతున్నారు. ఇక్కడ సుమారు 8 అంతస్తుల్లో ఈ అపార్ట్ మెంట్ నిర్మించాలని భావిస్తున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా భారీగా డబ్బులు వెచ్చించి ఈ భవాన్ని కట్టించబోతున్నారు. ఇప్పటికే ఈ భవానికి సంబంధించిన వాస్తు, నిర్మాణ వ్యయానికి సంబంధించి పూర్తి క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

2022లో ఆలియా, రణ్ బీర్ పెళ్లి  

అటు అలియా భట్, రణ్ బీర్ కపూర్ కొంత కాలం డేటింగ్ చేశారు. ఏప్రిల్ 14, 2022 నాడు ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకలో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లయిన రెండు నెలలకే తాము పేరెంట్స్ కాబోతున్నామని ఆలియా, రణ్ బీర్ ప్రకటించారు. నవంబర్ 2022లో వీరికి  అమ్మాయి జన్మించింది.  ఇక వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న విడుదల అయ్యింది. దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది.

View this post on Instagram
 
A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

Read Also: ఆలియా భట్ చెప్పులు తీసిన భర్త రణ్‌బీర్ కపూర్, నెటిజన్స్ ప్రశంసల జల్లు!

Published at : 25 Apr 2023 12:03 PM (IST) Tags: Ranbir Kapoor Alia Bhatt Alia Bhatt New house Bandra house

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి రోజు రావాలి - రూ.190 కోట్ల బంగ్లా కొనుగోలుపై ఊర్వశీ రౌతేలా తల్లి స్పందన

అలాంటి రోజు రావాలి - రూ.190 కోట్ల బంగ్లా కొనుగోలుపై ఊర్వశీ రౌతేలా తల్లి స్పందన

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

టాప్ స్టోరీస్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్