Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
అజిత్ తాజా మూవీ ‘AK62’ నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో దర్శకుడు వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విఘ్నేష్ ఎందుకు తప్పుకున్నాడు?
‘తునివు’ సినిమాతో సంక్రాతి బరిలో నిలిచిన అజిత్, మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే, దళపతి విజయ్ ‘వారిసు’ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అజిత్ మరో సినిమాను చేస్తున్నట్లు వెల్లడించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘AK62’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరో దర్శకుడు వచ్చి చేరాడట.
విఘ్నేష్ స్థానంలోకి మగిజ్ తిరుమేని
ప్రస్తుతం ‘AK62’ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించనున్నారు. ‘తడమ్’, ‘కలగ తలైవన్’ సినిమాలతో తిరుమేని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ప్రస్తుతం అజిత్ తో భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.
అజిత్ మార్పులకు ఒప్పుకోని విఘ్నేష్
అటు అజిత్ సినిమా నుంచి విఘ్నేష్ శివన్ తప్పుకోవడానికి కారణలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా, క్రియేటివ్ విభేదాల కారణంగా ఆయనను మార్చినట్లు తెలుస్తోంది. విఘ్నేష్ శివన్ చెప్పిన స్క్రిప్ట్ అజిత్ కు పూర్తి స్థాయిలో నచ్చలేదట. పలు చోట్ల ఆయన మార్పులు, చేర్పులు సూచించారట. అయితే, తన స్ర్కిప్ట్ లో మార్పులు చేసేందుకు తను ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలోనే విఘ్నేష్‌ను ఈ చిత్రం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
అజిత్, విఘ్నేష్ మధ్య క్రియేటివ్ విభేదాలు
రాబోయే తన సినిమా దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ‘దళపతి 67’కు దీటుగా ఉండాలని అజిత్ భావిస్తున్నారట. అందులో భాగంగానే తన సినిమా కథ పవర్ ఫుల్ గా ఉండాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని విఘ్నేష్ శివన్ కు చెప్పి అదిరిపోయే కథ రాయాలని చెప్పారట. కానీ, అజిత్ చెప్పినట్లు కాకుండా, తనకు నచ్చినట్లుగా విఘ్నేష్ స్ర్కిప్ట్ రెడీ చేశారట. దాన్ని అజిత్ దగ్గరికి తీసుకెళ్లి చూపించారట. ఈ స్ర్కిప్ట్ తనకు పూర్తి స్థాయిలో నచ్చకపోవడంతో చాలా చోట్ల మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారట. కానీ, అజిత్ చెప్పిన మార్పులు చేస్తే కథ దెబ్బతింటుందని విఘ్నేష్ చెప్పారట. ఈ నేపథ్యంలో సినిమా నుంచి అతను తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ‘AK62’ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అట్లీ, విష్ణు వర్ధన్ వంటి దర్శకుల పేర్లును కూడా పరిశీలించారట. చివరకు మగిజ్ తిరుమేని ఓకే అయినట్లు తెలుస్తోంది. అజిత్ పెట్టుకున్న నమ్మకాన్ని తిరుమేని ఏమేరకు నిలబెడతాడో వేచి చూడాల్సిందే.
View this post on Instagram
Read Also: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్ !