Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుజిత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కబోతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు‘. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతోంది. మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకోటి ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు.
ఈ నెల 30న పవన్-సుజిత్ మూవీ లాంచ్
తాజాగా యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. సినిమా ఈ నెల(జనవరి) 30న లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించనున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజీత్, పవన్ తో కొత్త సినిమాను డిసెంబర్ 2022లో అధికారికంగా ప్రకటించారు. జనవరి 30న హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధం అవుతోంది. ఈ సినిమాను DVV దానయ్య హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
విడుదలకు రెడీ అవుతున్న ‘హరి హర వీర మల్లు’
ఇక దర్శకుడు క్రిష్ జాగర్లమూవీ తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నది. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 2020లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం ఆలస్యమైంది. మార్చి 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ చివరి సారిగా తెలుగులో భీమ్లా నాయక్ అనే సినిమా చేశారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే అందించారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘అయ్యప్పనున్ కోషియుమ్’ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్
మరోవైపు రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. వారాహి వాహనం మీద యాత్ర మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటేలా అడుగులు వేస్తున్నారు.
View this post on Instagram
Read Also: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్