News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ajay Devgn Office: ముంబైలో కొత్త ఆఫీస్ కొనుగోలు చేసిన అజయ్ దేవగన్, ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముంబైలో కొత్త ఆఫీస్ కొనుగోలు చేశారు. మొత్తం 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆఫీస్ స్పేస్‌ తీసుకున్నారు. దీని కోసం ఆయన భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ లో కొద్ది దశాబ్దాలుగా రాణిస్తున్న నటుడు అజయ్ దేవగన్. నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగానూ రాణిస్తున్నారు. ఆయన సతీమణి కాజోల్ కూడా కొన్ని ఏండ్లుగా హిందీ చిత్ర సీమలో రాణిస్తోంది. అద్భుత సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అజయ్ దేవగన్ రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోనూ నటించి మెప్పించారు. తాజాగా ఈయన ముంబైలో కొత్త ఆఫీస్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇందుకోసం భారీగా డబ్బు వెచ్చించారు.

రూ. 45 కోట్లతో కొత్త ఆఫీస్ ప్రాపర్టీల కొనుగోలు

ముంబైలోని పశ్చిమ సబర్బ్ అంధేరిలోని ఓషివారా ప్రాంతంలో ఆయన తాజాగా తన కార్యాలయం కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. రెండు వేర్వేరు లావాదేవీలలో ఐదు కార్యాలయ ప్రాపర్టీలను తీసుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 45 కోట్ల రూపాయలను వెచ్చించారు. రియల్టీ డెవలపర్ వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ సిగ్నేచర్ నిర్మిస్తున్న బిజినెస్ ప్రాజెక్ట్‌ లో మొత్తం ఐదు ప్రాపర్టీలు రెండు అంతస్తులలో 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మొదటి యూనిట్ 8,405 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటుండగా, ఇది ఓషివారాలోని సిగ్నేచర్ బిల్డింగ్‌లోని 16వ అంతస్తులో ఉంది. దీని విలువ రూ.30.35 కోట్లు. అయితే, అజయ్ స్టాంప్ డ్యూటీగా రూ.1.82 కోట్లు చెల్లించినట్లు సమాచారం. రెండవ యూనిట్ అదే భవనంలోని 17వ అంతస్తులో ఉంది. ఇది 4,893 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనికి రూ.88.44 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్రాపర్టీ ఖర్చు రూ 14.74 కోట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 19, 2023న విశాల్ వీరేందర్ దేవగన్ పేరుతో ఈ ఆస్తులు రిజిస్టర్ చేశారు. అజయ్ అసలు పేరు విశాల్ వీరేందర్ దేవగన్ అనే విషయం తెలిసిందే. అటు ఏప్రిల్ 13న ముంబైలో రూ. 16.5 కోట్ల విలువైన ఇంటిని కాజోల్ కొనుగోలు చేసిన 5 రోజులకే ఈ ప్రాపర్టీ కూడా రిజిస్టర్ కావడం విశేషం. అయితే, ఈ ప్రాపర్టీలకు సంబంధించి అజయ్ దేవగన్ వైపు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

ఇక ప్రస్తుతం అజయ్  స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అజ‌య్ దేవ్‌గ‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. ఇండియ‌న్ ఫుట్‌ బాల్‌ కు స్వ‌ర్ణ‌యుగంగా చెప్పుకునే 1952 నుంచి 62 మ‌ధ్య కాలంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో స్పోర్ట్స్ బ‌యోపిక్‌గా మైదాన్ మూవీ రూపొందింది. ఇందులో భార‌త మాజీ ఫుట్‌బాల్ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ పాత్ర‌లో అజ‌య్ దేవ్‌గ‌న్ కనిపించారు. అటు అభిషేక్ కపూర్ తో కలిసి  మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని, అజయ్ మేనల్లుడు అమన్ దేవగన్‌ తొలి చిత్రంగా రానున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దర్శకుడిగానూ  వ్యవహరిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

Read Also: నేను పడక గదిలో కూడా అలాగే ఉంటా - కంగనా షాకింగ్ కామెంట్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Jul 2023 10:48 AM (IST) Tags: Ajay Devgn Ajay Devgn new Office Ajay Devgn Andheri Office Ajay Devgn new Office Price

ఇవి కూడా చూడండి

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత