By: ABP Desam | Updated at : 22 Jul 2021 12:47 PM (IST)
Raj_Kundra
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు వ్యతిరేకంగా కొందరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. మీడియా ముందుకు మాత్రం ఒకరిద్దరు మాత్రం వస్తున్నారు. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఆయనకు మద్దతు తెలపడం విశేషం. ఈ కేసులో పెద్ద సెలబ్రిటీలు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. స్పందిస్తున్న తారలు మాత్రం రాజ్ కుంద్రా చేసింది తప్పు కాదని.. అదొక వ్యాపారమని.. పోర్న్ కి, ఎరోటిక్ సినిమాలకు తేడా చూడాలని అంటున్నారు.
రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీయలేదని.. ఎరోటిక్ సినిమాలు మాత్రమే తీస్తున్నారని చెబుతున్నారు. గెహనా వశిష్ట్ అనే నటి రాజ్ కుంద్రా తీసిన సినిమాలను చూసిన తర్వాతే.. అవి పోర్నా, ఎరోటిక్ సినిమాలా అనే విషయంపై స్పష్టతకు రావాలని చెబుతోంది. అప్పటివరకు ఆయన నేరం చేసినట్లుగా నిర్ణయానికి రావొద్దని చెప్పింది. మరో నటి రాఖీ సావంత్ కూడా రాజ్ కుంద్రాను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆయన బ్లాక్ మెయిలింగ్ కు బలయ్యారని ఆరోపించారు.
పాప్ స్టార్ మికా సింగ్ కూడా రాజ్ కుంద్రాకు మద్దతు ప్రకటించారు. తాను రాజ్ కుంద్రా యాప్ వీడియోలను చూశానని.. అందులో కేసులు పెట్టేంత ఏమీ లేదని అన్నారు. రాజ్ కుంద్రా మంది వ్యక్తి అని సమర్ధించారు. బాలీవుడ్ లో బాలాజీ టెలీఫిల్న్స్ ఓనర్ ఏక్తాకపూర్ కు ALT పేరుతో ఒక యాప్ ఉంది. అందులో అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఎరోటిక్ సిరీస్ లు చాలానే ఉంటాయి. రాజ్ కుంద్రా కూడా అలాంటి సిరీస్ లే తీసి యాప్ లో ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు.
రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేసిన వారిలో ఎక్కువ మంది ఆయనతో కలిసి పని చేసిన వారే ఉన్నారని అంటున్నారు. గతంలో పూనమ్ పాండే కూడా రాజ్ కుంద్రాపై కంప్లైంట్ చేసింది. ఆమె రాజ్ కుంద్రా యాప్ లో నటించింది. కొన్ని లావాదేవీల్లో తేడాలు రావడంతో ఫిర్యాదు చేసిందే కానీ తప్పుడు పనులు చేయిస్తున్నారని కాదు. మొత్తానికి బాలీవుడ్ లో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.
ఇంతకీ ఈ వ్యాపారం రాజ్ కుంద్రా ఎప్పటినుండి చేస్తున్నారనే విషయంపై పోలీసులు స్పందించారు. దాదాపు ఏడాదిన్నరగా రాజ్ కుంద్రా ఈ వ్యాపారంలో ఉన్నారని.. కరోనా లాక్ డౌన్ దగ్గర నుండి వారి వ్యాపారం ఊపందుకుంది చెప్పారు. ఈ వ్యాపారం ద్వారా కుంద్రా రోజుకి ఆరు నుండి ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Major Ticket Prices: కరోనా తర్వాత తక్కువ టికెట్ రేట్స్ వసూలు చేస్తున్న సినిమా అడివి శేష్ మేజర్
Karate Kalyani: యూట్యూబ్ ఛానెల్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు!
Manjusha Neogi Death: కోల్కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!
F4 Movie Update: 'ఎఫ్ 4' అనౌన్స్ చేసిన అనిల్ రావిపూడి, గోవాలో...
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి