Major: 'మేజర్' ట్రైలర్ కి డేట్ ఫిక్స్ - మినీ వీడియో అదిరిందంతే

మే 9న 'మేజర్' ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరించినట్లు నటి శోభితా దూళిపాళ్ల వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. 

FOLLOW US: 

'మేజర్'.. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. 

వేసవి కానుకగా మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈరోజు ముంబై చిన్న ఈవెంట్ ను ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 9న 'మేజర్' ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరించినట్లు నటి శోభితా దూళిపాళ్ల వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. 

ఇందులో నటీనటులు ఒకే సీన్ ను వేర్వేరు భాషల్లో డైలాగ్స్ చెబుతూ నటిస్తూ కనిపించారు. ఈ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో ఉంది. 'మేజర్' సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లితో కలిసి సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.

Also Read: 'ఎఫ్3' ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ - ఫ్యాన్స్ రెడీనా?

Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?

View this post on Instagram
 
A post shared by Sobhita Dhulipala (@sobhitad)

Tags: Mahesh Babu Adivi Sesh Major movie sasi kiran thikka Major Movie Trailer

సంబంధిత కథనాలు

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం

Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Kamareddy Rains: కామారెడ్డి జిల్లాలో అకాలవర్షాలు...తడిసిపోయిన ధాన్యం|ABP Desam

Kamareddy Rains: కామారెడ్డి జిల్లాలో అకాలవర్షాలు...తడిసిపోయిన ధాన్యం|ABP Desam

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం