News
News
X

Adivi Sesh's HIT 2 Teaser: హిట్-2 టీజర్ - అవతలి టీమ్ వీక్ అని మన గోల్‌ కీపర్‌కు రెస్ట్ ఇవ్వలేం కదా!

'హిట్2' సినిమా పై ముందునుంచీ అంచనాలు భారీ గానే ఉన్నాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

FOLLOW US: 

హీరో అడివి శేష్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సొంత టాలెంట్ తో పైకి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం నటించిన సినిమా 'హిట్2'. ఈ సినిమా పై ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. గురువారం మూవీ టీమ్ ‘హిట్ 2’ టీజర్‌ విడుదల చేసింది.

నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన ‘హిట్’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ముందు నుంచే వార్తలు వచ్చాయి. అయితే ‘హిట్ సెకండ్ కేస్’లో హీరోగా అడవి శేష్ కనిపించనున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు మూవీ టీమ్. టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.

ఇక టీజర్ విషయానికొస్తే.. అడివి శేష్ విశాఖపట్నంలో పని చేసే ఒక పోలీసు అధికారిగా కనిపించాడు. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, నోటి దురుసు ఆఫీసర్‌లా శేష్ ఆకట్టుకున్నాడు. ‘‘అవతలి టీమ్ వీక్ అని మన గోల్ కీపర్ కి రెస్ట్ ఇవ్వలేం కదా’’ లాంటి డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. ఆయన విధులు నిర్వర్తిస్తోన్న ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి శరీర భాగాలు నరికి చంపినట్లు కనిపిస్తోంది.

 ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఆమెను ఎవరు హత్య చేశారు ? ఈ హత్యకు గల కారణాలు ఏంటి ? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో కూడిన క్రైమ్, థ్రిల్లర్ మూవీ లా ఉంటోందని అనిపిస్తోంది టీజర్. ఈ సినిమాలో కూడా హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ మధ్య రిలేషన్ ఉందని గతంలోనే రివీల్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్‌‌తో అది స్పష్టంగా తెలుస్తోంది. థ్రిల్, యాక్షన్, ఫన్, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రావు రమేష్ డీజీపీ పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్ చూస్తే సినిమా మొత్తం విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. 

News Reels

'హిట్' సినిమా ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'హిట్ ది సెకండ్ కేస్' సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అడివి శేష్ ఇలాంటి క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు. 'మేజర్' సినిమాతో అడివి శేష్ కు బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ కొడతారో చూడాలి మరి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మీనాక్షి చాదరి హీరోయిన్‌గా నటిస్తోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మించారు.

Also Read: ప్రభాస్ 'సాహో'లో సీన్స్ కాపీ చేసిన షారుఖ్ 'పఠాన్'?

Published at : 03 Nov 2022 02:09 PM (IST) Tags: nani Adivi Sesh HIT 2 sailesh kolanu

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి