అన్వేషించండి

Adipurush: 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్!

అక్టోబ‌రు 2న 'ఆదిపురుష్‌' ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు రానుంది. ఇకపై వ‌రుస‌గా 'ఆదిపురుష్‌'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర‌బృందం భావిస్తోంది.

ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ద‌స‌రా కానుకగా.. అక్టోబ‌రు 2న 'ఆదిపురుష్‌' ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు రానుంది. ఇకపై వ‌రుస‌గా 'ఆదిపురుష్‌'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈసారి దీపావ‌ళి కూడా అక్టోబ‌రులోనే వచ్చింది. అక్టోబ‌రు 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు.. 24న దీపావ‌ళి. అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!

హాలీవుడ్ లో 'ఆదిపురుష్': 
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

'ఆదిపురుష్' కోసం 35,000 షోలు: 
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారట.ఇండియా మొత్తం మీద, టోటల్ ఎన్ని థియేటర్లు, లేదంటే స్క్రీన్‌లు ఉన్నాయి? అంటే... సుమారు 9,500 అని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు. గతంలో పది వేలకు పైగా ఉండేవి. కరోనా కాలంలో కొన్ని సింగిల్ స్క్రీన్‌లను గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్‌లు మార్చేశారు. ప్రస్తుతం ఉన్నవాటిలో వీలైనన్ని స్క్రీన్‌ల‌లో 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.

ఒక్కో థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు ప్రదరిస్తారు. ఐదు షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో... రోజుకు 40,000 షోస్ వేయొచ్చు. వెయ్యి , పదిహేను వందల థియేటర్లు వేరే సినిమాలకు వదిలేసినా... ఎనిమిది వేల థియేటర్లలో 'ఆదిపురుష్' విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో నాలుగు షోలు, కొన్ని థియేటర్లలో ఐదు షోలు వేస్తే? రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్‌ టాక్.

Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 

Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Aasmaan Telugu Teaser : మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్ - హీరోగా శ్రీహరి కొడుకు... టీజర్ ఎలా ఉందంటే?
మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్ - హీరోగా శ్రీహరి కొడుకు... టీజర్ ఎలా ఉందంటే?
Bold Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Messi Telugu Movie: తెలుగులో మలయాళ స్పోర్ట్స్ డ్రామా... ఫుట్‌బాల్ దేవుడు 'మెస్సి' పేరుతో డబ్బింగ్
తెలుగులో మలయాళ స్పోర్ట్స్ డ్రామా... ఫుట్‌బాల్ దేవుడు 'మెస్సి' పేరుతో డబ్బింగ్
Modha Rathri OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget