News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

‘ఆదిపురుష్’ సినిమాను భారీ అంచనాల మధ్య తెరకెక్కించారు మేకర్స్. అందుకే సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు.

FOLLOW US: 
Share:

Adipurush: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ ప్రాజెక్ట్ సినిమాలలో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ లు నటించారు. ఈ సినిమాకు దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన పస్ట్ లుక్ టీజర్ లు మూవీ పై అంచనాలు పెంచేశాయి. అందులోనూ రామాయణ గాథ ఆధారంగా వస్తోన్న సినిమా కాబట్టి ప్రేక్షకల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ను ప్రకటించారు మూవీ మేకర్స్. తిరుపతిలో ఈ నెల 6 న వైభంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. 

భారీ సెట్టింగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..

‘ఆదిపురుష్’ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు మూవీటీమ్. సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చినజీయార్ స్వామీజీ హాజరై ఆశీస్సులు అందజేయనున్నారు. అలాగే ఈ వేడుకలో 50 అడుగుల ప్రభాస్ హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఆదిపురుష్ , రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఈవెంట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేసే అయోధ్య యొక్క భారీ సెట్‌ను ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు లక్షకు పైగానే ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ లో భాగం కానున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 

‘బాహుబలి’ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

‘ఆదిపురుష్’ సినిమాను భారీ అంచనాల మధ్య తెరకెక్కించారు మేకర్స్. మూవీ టీమ్ అంతా ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. తిరుపతిలో ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి ది బిగినింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా తిరుపతిలోనే పెట్టారు. ఆ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. అలాగే ఇప్పుడు ఈ ‘ఆదిపురుష్’ ఈవెంట్ కూడా ఇక్కడే పెట్టడంతో రెబల్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైష్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి జూన్ 16 న విడుదల సినిమా కానుంది.

Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!

Published at : 05 Jun 2023 08:27 PM (IST) Tags: Kriti Sanon Adipurush Om Raut Adipurush Pre Release Event Actror Prabhas

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: నువ్వేమైనా పెద్ద పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్

Bigg Boss Telugu 7: నువ్వేమైనా పెద్ద పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !

Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !

‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి