అన్వేషించండి

Varsha Bollamma: బడా నిర్మాత కొడుకుతో పెళ్లిపై ఫన్నీగా స్పందించిన వర్ష బొల్లమ్మ

హీరోయిన్ వర్ష బొల్లమ్మ పై రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందించింది. తన పెళ్లి పై వస్తున్న వార్తలకు సమాధానమిచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు కొదవేం లేదు. ఎవరిపై ఎప్పుడు ఎలాంటి రూమర్స్ పుట్టుకొస్తాయో ఎవరికి తెలీదు. ముఖ్యంగా హీరోయిన్ లపై రూమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వాటిపై వారు స్పందించకపోతే ఆ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే, హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాత్రం అలా చేయలేదు. తన మీద వస్తోన్న ప్రచారంపై స్పందించింది. తన స్టైల్ లో వాటికి సమాధానం చెప్పింది వర్ష. ఇంతకీ తన మీద వస్తోన్న ప్రచారం ఏంటి అనే కదా మీ డౌట్ అయితే ఇది చదివేయండి. 

ఇటీవల కాలంలో తెలుగులో కొంతమంది హీరోయిన్ లు బడా నిర్మాతల కోడళ్లుగా సెటిల్ అయిపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో అనన్య నాగళ్ల పై కూడా అలాంటి ప్రచారమే వచ్చింది. మల్లేశం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తీచ్చుకున్న అనన్యకు వరుసగా పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి టైమ్ లో అనన్య ఓ నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్ళిపోతుందని, తక్కువ టైమ్ లోనే జాక్ పాట్ కొట్టిందని వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. దానిపై ఆమె కూడా స్పందించలేదు.

మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ వర్ష బొల్లమ్మపై అలాంటి రూమర్స్ వస్తున్నాయి. తమిళ్, మలయాళంలో పలు సినిమాలు చేసిన వర్ష తెలుగులో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా స్వాతిముత్యం సినిమాలో కనిపించింది ఈ అమ్మడు. ఇదే సమయంలో వర్ష పై ఓ వార్త ప్రచారంలో ఉంది. వర్ష పై ఓ బడా నిర్మాత కొడుకు మనసు పారేసుకున్నారని, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో చెప్పేశాడని ఇక వర్ష ఆ నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్ళిపోతుంది అని వార్తలు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే తనపై వస్తోన్న వార్తల్ని కొట్టిపారేసింది వర్షా. తనపై వస్తోన్న పుకార్లకు ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పింది వర్ష. "నాకోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు చేసి, ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఆ అబ్బాయి ఎవరో నాక్కూడా చెప్తే, నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా" అంటూ సెటైర్ వేస్తూ సమాధానం చెప్పింది వర్ష. ప్రస్తుతానికి తన పెళ్లి చూపులు చూడాలి అనుకుంటే ఆహాలో 'స్వాతిముత్యం' సినిమాలో చూడండి అంటూ చురకలంటించింది. తన పై వచ్చినవన్నీ ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పేసింది. మరి ఇప్పటికైనా వర్ష పెళ్లిపై వస్తోన్న పుకార్లు కు ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి. 'చూసి చూడంగానే’ సినిమాతో తెలుగులో  అడుగుపెట్టిన వర్ష ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తనదైన నటనతో మెప్పించి ఆమె ఆడియెన్స్‌కు దగ్గరైంది. రీసెంట్ గా స్వాతిముత్యం సినిమాలో మెరిసింది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి.

Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Embed widget