Rambha Car Accident : హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్ - స్కూల్ నుంచి పిల్లలతో వస్తుండగా...
సీనియర్ హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్ అయ్యింది. స్కూల్ నుంచి పిల్లలను తీసుకు వస్తుండగా ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు.
సీనియర్ హీరోయిన్, నటి రంభ (Actress Rambha) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది. ఆ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆయా ఒకరు ఉన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. అసలు వివరాల్లోకి వెళితే...
Rambha Car Accident : ''పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా... ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్ గా ఉన్నాం. చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం'' అని రంభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Rambha Car Accident Images : ఆస్పత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్ ఫోటోలను రంభ షేర్ చేశారు. ఎస్‌యువి కార్ కావడంతో యాక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్ల, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. కాకపోతే డోర్స్ మాత్రం బాగా డ్యామేజ్ అయ్యాయి. రంభ పోస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని మెసేజ్, పోస్టులు చేస్తున్నారు.
View this post on Instagram
తెలుగులో ఒకప్పుడు రంభ స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవితో 'బావగారూ బాగున్నారా?', నట సింహం బాలకృష్ణతో 'భైరవ ద్వీపం', కింగ్ నాగార్జునతో 'హలో బ్రదర్', విక్టరీ వెంకటేష్ సరసన 'ముద్దుల ప్రియుడు', జేడీ చక్రవర్తితో 'బొంబాయి ప్రియుడు' తదితర సినిమాల్లో రంభ నటించారు. తమిళ, హిందీ సినిమాల్లోనూ ఆవిడ నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'యమదొంగ', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'దేశముదురు' సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించారు. కొన్నాళ్లుగా ఆమె నటనకు దూరంగా ఉన్నారు.
Also Read : ప్రభాస్ మరో సినిమా వాయిదా - సల్మాన్‌కు పోటీగా వెళతాడా?
ఇప్పుడు రంభ సినిమాలు చేయడం లేదు. ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూ... పిల్లలతో బిజీ బిజీగా ఉన్నారు. భర్తతో పాటు విదేశాల్లో ఉంటున్నారు. కెనడాలో సెటిల్ అయ్యారు. రంభ, ఇందిరన్ పద్మనాభన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. అబ్బాయి చిన్నవాడు.
కొన్ని రోజుల క్రితం చెన్నై వచ్చినప్పుడు సీనియర్ హీరోయిన్లు, ఇండస్ట్రీలో తన స్నేహితులను కలిశారు. అప్పుడు రంభ, ఆమె పిల్లలతో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''పాత స్నేహితులను కలవడం, సరదాగా నవ్వడం, బిర్యానీ తినడం కంటే మంచి ఫీలింగ్ ఏదీ ఉండదు. పిల్లల మధ్య బాండింగ్ కూడా బలపడినప్పుడు... వాళ్ళు కలిసినప్పుడు ఇంకా బావుంటుంది. చెన్నైలో ఓ సాయంత్రం వేళ రంభ ఇంట్లో సరదాగా టైమ్ స్పెండ్ చేశాం'' అని ఖుష్బూ పేర్కొన్నారు.